మళ్లీ పెళ్లి’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రముఖ సీనియర్‌ దర్శక నిర్మాత ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. రమ్య రఘుపతితో గొడవలు.. ఆమె మీడియా ముందుకు వచ్చిన చేసిన ఆరోపణలు, హోటల్‌లో నరేష్, పవిత్రా లోకేశ్ దొరికిపోవడం వంటి సన్నివేశాలన్నింటినీ..

టాలీవుడ్ సీనియర్ నటులు నరేష్, పవిత్రా లోకేష్‌ల పేర్లు గత కొన్ని రోజులుగా తరచూ వినిపిస్తున్నాయి. వీరి ప్రేమాయణం, పెళ్లి గురించి సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారి తీసింది. కొత్త ఏడాది రోజున తామిద్దరం కొత్త జీవితం ప్రారంభిస్తున్నామంటూ ఒక వీడియోను రిలీజ్‌ చేసి అధికారికంగా తమ ప్రేమను ప్రకటించారు నరేశ్‌, పవిత్ర. దీంతో వీరి ప్రేమ, పెళ్లి నిజమేననుకున్నారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే సడెన్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. తమ నెక్ట్స్‌ సినిమా కోసమే ఈ వీడియో చేశారని తెలసింది. ‘మళ్లీ పెళ్లి’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రముఖ సీనియర్‌ దర్శక నిర్మాత ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. రమ్య రఘుపతితో గొడవలు.. ఆమె మీడియా ముందుకు వచ్చిన చేసిన ఆరోపణలు, హోటల్‌లో నరేష్, పవిత్రా లోకేశ్ దొరికిపోవడం వంటి సన్నివేశాలన్నింటినీ టీజర్‌లో యథావిధిగా చూపించారు. దీంతో మళ్లీ పెళ్లి మూవీ నరేష్‌, పవిత్రల బయోపిక్కే అని నెటిజన్లు కామెంట్ చేశారు. తెలుగుతో పాటు కన్నడలోనూ ఈ మూవీని ఆడియెన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మళ్లీ పెళ్లి సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఈనెల 26న మూవీని విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎంఎస్ సుబ్బరాజు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

నరేశ్‌, పవిత్రల రీల్‌ లైఫ్‌లో జరిగిన సంఘటనలనే మళ్లీ పెళ్లి సినిమాతో తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేశ్. విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై నరేష్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నరేశ్, పవిత్రలతో పాటు జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. అలాగే ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ..జునైద్ సిద్ధిక్ ఎడిటర్ గా వ్యవహరించగా.. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.

ఇవి కూడా చదవండి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *