ఈ నెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడి రూపంలో తయారు చేసిన ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విగ్రహం కూడా తుది మెరుగులు దిద్దుకుంది. అయితే ఈ విగ్రహాన్ని యాభై నాలుగు అడుగులతో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ విగ్రహావిష్కరణకు ప్రాధాన్యత ఉంది. రాజకీయాలకు అతీతంగానే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు, ట్యాంక్ బండ్ కు ఈ విగ్రహం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తానా అసోసియేషన్ తో పాటు అనేక మంది విగ్రహ ఏర్పాటుకు సహకారం అందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘డి యావోల్ ఎక్స్’ పేరుతో ఆర్యన్ ఖాన్ దుస్తుల బిజినెస్.. విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

Pawan Kalyan: బాంబే కథ ముగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

Game Changer: ఇది పాన్ ఇండియన్ మూవీ కాదా

Adipurush: ఆదిపురుష్‌ ట్రైలర్‌ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే ??

PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed