బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన 3 నిమిషాల గ్లిప్స్‌ అండ్ … గంగాలమ్మ లుక్‌తోనే రికార్డుల పరంపర స్టార్ట్ చేసిన పుష్ప రాజ్‌.. స్టిల్ ఆ రికార్డులను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రికార్డుల మీద రికార్డులు సెట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఆడియో రైట్స్‌ రూపంలో దిమ్మతిరిగే ..దద్దరిల్లిపోయే రేంజ్‌ రికార్డును నెలకొల్పారు పుష్ప రాజ్‌.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప ఎలాంటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ఊచకోత నడిచింది. కేవలం తెలుగు రాష్ట్రాలు.. బన్నీకి మార్కెట్ ఉన్న కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్‌ లెవల్‌లో పుష్ప దుమ్ములేపింది. అవును ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సైతం పుష్ప సిగ్నేచర్ స్టెప్స్ వేయడం చూశాం. త్వరలో పుష్ప 2 ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రజంట్ అదే పనిలో ఉన్నారు బన్నీ, సుకుమార్. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ప వచ్చాడని అర్థం అంటూ ఇటీవల ఓ టీచర్ రిలీజ్ చేసి పార్ట్‌2పై అంచనాలు మరింత పెంచారు. గంగాలమ్మ లుక్‌లో బన్నీని చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.

అయితే పుష్ప సినిమా హిట్ అవ్వడానికి గల ఫ్లస్సుల్లో మ్యూజిక్, సాంగ్స్ సింహభాగం షేర్ తీసుకుంటాయి. ఏమన్నా సాంగ్స్ హా అవి. ఒక్కోటి ఒక్కో మ్యాజిక్. అందుకే పుష్ప 2 ఆడియో రైట్స్‌ కోసం ఫిల్మ్ ఇండిస్ట్రీల్లో పోటీ ఎక్కువైంది. ఇక ఈ క్రమంలోనే.. టీ సిరీస్‌ దాదాపు 65కోట్లకు ఈ మూవీ ఆడియో రైట్స్‌ను దక్కించుకుందనే టాక్ ఫిల్మ్ నగర్ నుంచి వస్తుంది.  RRR, సాహో, బాహుబలి 2 వంటి మునుపటి బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్ ఆల్బమ్స్ రేటును అధిగమించి ఈ చిత్ర రైట్స్ అమ్ముడయినట్లే లెక్క.  దీంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరోసారి పుష్పరాజ్ హాట్ టాపిక్ అయ్యాడు.

ఇది నిజంగా అమేజింగ్ రికార్డ్‌ అనే కామెంట్ ఇప్పుడు నెట్టింట తెగ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఈ మూవీలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ స్కోర్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. పుష్ప: ది రూల్ మున్ముందు ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed