పుష్ప సినిమాలో కేశవ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీష్ ప్రతాప్ బండారి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సత్తిగాని రెండెకరాలు. వెన్నెల కిశోర్, అనీషా, మోహన శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభినవ్ దండ దర్శకత్వం వహించారు.
పుష్ప సినిమాలో కేశవ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీష్ ప్రతాప్ బండారి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సత్తిగాని రెండెకరాలు. వెన్నెల కిశోర్, అనీషా, మోహన శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభినవ్ దండ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ భారీ సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని రూపొందించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే కొన్ని కారణాలతో ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. అయతే ఎట్టకేలకు రిలీజ్ ముహూర్తాన్ని ఖరారు చేసుకుంది. తాజాగా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మే 26 నుంచి సత్తిగాని రెండెకరాలు సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుందని ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ఈమేరకు కొత్త పోస్టర్ కూడా విడుదల చేసింది. దీనికి ‘‘సత్తి ముందు జెప్పిన రోజు రాలే.. వాని రెండెకరాల భూమి చిక్కుల్లో పడిండే.. ఇగ అన్నీ సెటిల్ అయినయ్. మే 26న ముహూర్తం పెట్టినం. అస్తుండు, ఆగమాగం జేయనీకి’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
కాగా భూ సమస్యల నేపథ్యంలో సత్తిగాని రెండెకరాలు సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. టీజర్‌లో చెప్పిన ప్రకారం.. హీరో జగదీష్ ప్రతాప్ బండారి ఓ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసం ఆయనకు రూ. 25 లక్షలు అవసరమవుతాయి. అందుకోసం తనకున్న రెండెకరాల భూమిని అమ్మేయాలని అనుకుంటాడు. ఆ విషయంలో హీరోకి ఎదురయ్యే పరిస్థితులు, అవాంతరాలు ఏంటీ? వాటిని ఎలా అధిగమిస్తాడు అన్నదే ఈ సినిమా కథ. మరి పుష్పతో బన్నీ స్నేహితుడి పాత్రలో ప్రశంసలు అందుకున్న జగదీష్ ఈ మూవీతో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.
#SathiGaaniRenduEkaralu premieres on @ahavideoIN on
May 26th! @OG_Jagadeesh @vennelakishore @_mohanasree @DamaAneesha @RajTirandasu @BithiriSathiV6 @abhinavdanda #SGRE pic.twitter.com/7gQpXTzZWk— Cinema Mania (@ursniresh) May 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..