అందులో ఉన్న యువరాణి ఎవరో గుర్తుపట్టండి. ఆమె బాలీవుడ్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులోనూ బ్లా్క్ బస్టర్ హిట్ చిత్రంలో నటించి మెప్పించింది. అయితే కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఈవెంట్లో మెరిసింది.

గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో స్టార్స్ ఎక్కువగా యాక్టివ్ ఉంటున్న సంగతి తెలిసిందే. సామాన్యులే కాకుండా హీరోహీరోయిన్స్ నెట్టింట చాలా సమయం గడిపేస్తున్నారు. ఇందుకు కారణం అభిమానులతో నేరుగా ఇంట్రాక్ట్ అవుతూ తమ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడమే. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా చిట్ చాట్ నిర్వహిస్తూ ఫాలోవర్స్ ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా సెలబ్రెటీల క్రేజీ ఫోటోస్.. చైల్డ్ హుడ్ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఉన్న యువరాణి ఎవరో గుర్తుపట్టండి. ఆమె బాలీవుడ్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులోనూ బ్లా్క్ బస్టర్ హిట్ చిత్రంలో నటించి మెప్పించింది. అయితే కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఈవెంట్లో మెరిసింది. అందులో భాగంగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి.

పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. హైవే, కపూర్ అండ్ సన్స్, డియర్ జిందగీ వంటి చిత్రాలతో అలియా నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక తెలుగులో గతేడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అలాగే గతేడాది 2022 ఏప్రిల్ 14న తన ప్రియుడు రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్నారు అలియా. వీరికి రాహా పాప జన్మించింది. ప్రస్తుతం అలియా తన కూతురితో సమయాన్ని గడుపుతుంది. గత కొన్ని నెలలుగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూయార్క్ వేదికగా జరిగిన మెట్ గాలా 2023 వేడుకలో పాల్గొంది అలియా. వైట్ గౌనులో అచ్చం ప్రిన్సెస్ లా మెరిసింది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *