Ravindra Jadeja: ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా బ్యాట్ పరుగుల వర్షం కురిపించకపోవచ్చు. కానీ, బంతితో మాత్రం నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా మార్కస్ స్టోయినిస్‌ను అద్భుతమైన బంతికి పెవిలియన్ చేర్చాడు.
Ravindra Jadeja Viral Video
రవీంద్ర జడేజాను క్రికెట్‌లో రాక్‌స్టార్ అని ఎందుకు పిలుస్తారో అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి లక్నోలో రుజువు చేశాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ అద్భుతం చేశాడు. రవీంద్ర జడేజా తన అద్భుతమైన బంతితో అందర్నీ షాక్‌కి గురిచేశాడు. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్ ముందు నిలబడలేనంత ప్రమాదకరమైన బంతిని విసిరాడు. జడేజా వేసిన బంతిని మార్కస్ స్టోయినిస్ ఎదుర్కొనలేక, ముఖ్యంగా అర్థం చేసుకోలేక పోయాడు. దీంతో పెవిలియన్ బాట పట్టాడు. రవీంద్ర జడేజా వేసిన ఈ బంతిని ఐపీఎల్‌లో అత్యుత్తమ బాల్‌గా పిలుస్తున్నారు.
లక్నో ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో రవీంద్ర జడేజా ఈ బంతిని వేశాడు. జడేజా వేసిన ఈ బంతి లెగ్ స్టంప్‌పై పడింది. ఆ తర్వాత గిర్రున తిరిగి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. జడేజా వేసిన ఈ బంతి చాలా మలుపులు తిరిగింది. అసలేం జరిగిందో తెలియక స్టోయినిస్ అలాగే చూస్తుండిపోయాడు. ఆశ్చర్యపోతూ పెవిలియన్ చేరాడు.
𝗣.𝗘.𝗔.𝗖.𝗛!
That was an epic delivery from @imjadeja 🔥🔥
Follow the match ▶️ https://t.co/QwaagO40CB #TATAIPL | #LSGvCSK pic.twitter.com/dhPSVB4BuF
— IndianPremierLeague (@IPL) May 3, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..