TV9 opinion poll: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ‘టీవీ9’ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ప్రీ -పోల్ సర్వేలో బీజేపీ సాధారణ మెజారిటీ సాధిస్తుందని తేలింది. అదే విధంగా అధికార పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుందని కూడా సర్వేలో..

Karnataka Assembly Polls 2023

TV9 opinion poll: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ‘టీవీ9’ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ప్రీ -పోల్ సర్వేలో బీజేపీ సాధారణ మెజారిటీ సాధిస్తుందని తేలింది. అదే విధంగా అధికార పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుందని కూడా సర్వేలో తేలింది. ఏప్రిల్ చివరి వారంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణతో పోలిస్తే.. మే మొదటి వారంలో జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్)కి ప్రజా మద్దతు తగ్గింది. అలాగే ఏప్రిల్ చివరి వారం నాటికి జరిగిన సర్వేల ప్రకారం బీజేపీ 110 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. అయితే మే మొదటి వారం లెక్కలో మొత్తం 105 నుంచి 110 సీట్లు రాబట్టవచ్చని ప్రజలు అంటున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి 90 నుంచి 97 సీట్లు రావచ్చు. జేడీఎస్ 19 నుంచి 22 నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చు. ఇంకా సర్వే నివేదిక ప్రకారం 5 నియోజకవర్గాల్లో ఇతరులు గెలిచే అవకాశం ఉంది. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు’ అనే ప్రశ్నకు 48 శాతం మంది బీజేపీ, 33 శాతం మంది కాంగ్రెస్, 14 శాతం మంది జేడీఎస్, 5 శాతం మంది ఇతరులు సమాధానమిచ్చారు.

ఏ ఎన్నికల అంశానికి ఓటరు అభిమతం?

ఇవి కూడా చదవండి



రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఎన్నికల అంశంగా ఉండాలని 45 శాతం మంది అభిప్రాయపడగా, 21 శాతం మంది ఉద్యోగాల కల్పనకు అనుకూలంగా ఉన్నారు. 13% అవినీతి, 15% సామాజిక, మతపరమైన అంశాలు, 3% ఇతర అంశాలు ఎన్నికల సమస్యలుగా ఉండాలని అన్నారు.

కాంగ్రెస్ ఉచిత పథకాలకు స్పందన ఏమిటి?

‘కాంగ్రెస్ ప్రకటించిన ఉచిత ఆఫర్లను చూసి ఆ పార్టీకి ఓటేస్తారా?’ అనే ప్రశ్నకు 32 శాతం మంది అవుననే సమాధానమిచ్చారు. కానీ 56% మంది అస్సలు ఓటేయ్యరని, 12% మంది ఏమీ చెప్పలేమని చెప్పారు.

కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?

‘కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు’ అన్న ప్రశ్నకు బీజేపీకి అనుకూలంగా 45 శాతం మంది, కాంగ్రెస్‌కు 32 శాతం మంది సమాధానమిచ్చారు. బీజేపీ, జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని 5 శాతం మంది, కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని 6 శాతం మంది సమాధానమిచ్చారు. మరోవైపు లింగాయత్ వివాదం ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని 48 శాతం మంది చెప్పగా, ఎన్నికలపై ప్రభావం చూపదని 28 శాతం మంది, ఏమీ చెప్పలేమని 24 శాతం మంది అభిప్రాయపడ్డారు.

బజరంగ్ దళ్ వివాదం కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందా?

‘బజరంగ్ దళ్ వివాదం కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందా..?’ అని అడిగిన ప్రశ్నకు 54 శాతం మంది అవునని, 26 శాతం మంది కాదని, 20 శాతం మంది తాము ఏమీ చెప్పలేమని చెప్పారు. ఈ క్రమంలోనే 51 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శల వల్ల బీజేపీ లాభపడుతుందని సమాధానమిచ్చారు. 27 శాతం మంది ప్రయోజనం లేదని, 22 శాతం మంది ఏమీ చెప్పలేమని చెప్పారు.

మోడీ మెరుపు ప్రచారంతో భాజపా లాభపడుతుందా?

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ హోరెత్తిస్తున్నారు. 52 శాతం మంది దీని వల్ల బీజేపీ లాభపడుతుందని సమాధానమిచ్చారు. 21% మంది ఇది ఉపయోగకరంగా లేదని, 27% మంది ఏమీ చెప్పలేమని సమాధానం ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *