మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. డైరెక్టర్ కార్తీక్ దండు కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా .. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది. ఇందులో సంయుక్త నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ బ్యూటీకి మరో భారీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగు సినీపరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్. ఇప్పుడు ఈ అమ్మడు గోల్డెన్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష సినిమాలతో వరుస హిట్స్ అందుకుని ఫుల్ జోష్ మీదుంది సంయుక్త. ఇప్పుడు తనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అందంతోపాటు.. అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు మరిన్న ఆఫర్స్ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు విరూపాక్ష సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. డైరెక్టర్ కార్తీక్ దండు కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా .. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది. ఇందులో సంయుక్త నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ బ్యూటీకి మరో భారీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

అదెంటంటే.. లేటేస్ట్ సమాచారం ప్రకారం సంయుక్త నెక్ట్స్ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏తో ఉండబోతుందట. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న బన్నీ.. ఆ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట. ప్రస్తుతం మహేష్ బాబుతో మూవీ చేస్తున్న త్రివిక్రమ్ ఈ మూవీ తర్వాత బన్నీతో చేయనున్నారట. ఇందులో బన్నీ జోడిగా సంయుక్త నటించనుందని టాక్. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు చిత్రయూనిట్ సంప్రదించగా.. ఓకే చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు ప్రధాన పాత్రలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అంచనాలను పెంచేశాయి.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed