Trending Fast Bowler: జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, ఉమేష్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఎందరో ఫాస్ట్ బౌలర్లు టీమిండియా తరఫున ఆడి మెరుపులు మెరిపించారు. వీళ్ల ఆట మనందరికీ తెలుసు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో..

Trending Fast Bowler: జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్ వంటి ఎందరో ఫాస్ట్ బౌలర్లు టీమిండియా తరఫున ఆడి మెరుపులు మెరిపించారు. వీళ్లు మెరిపించే  మనందరికీ తెలుసు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఓ ఫాస్ట్ బౌలర్ గురించి మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు. అతను బాల్ వేస్తే వికెట్ల సంగతి ఏమో కానీ బ్యాటర్ల మూతి, ముక్కు లేదా తలలే పగలిపోవడం ఖాయం. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే అతని బైలింగ్‌కి రూల్స్ లాంటివి లేవు, నాన్ స్ట్రైయికింగ్ క్రీజు లేదు. తనకు ఇష్టం వచ్చినట్లుగా నేరుగా బ్యాటర్ ముందుకెళ్లి బంతిని విసురుతాడు. నమ్మలేకపోతున్నారా..? అయితే నెట్టింట వీడియోను మీరు చూడాల్సిందే.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ చిన్నోడు ఎక్స్పీరియెన్స్‌డ్ ఫాస్ట్ బౌలర్‌లా పరుగులు తీసుకుంటూ బంతిని వదులుతాడు. తనకు క్రికెట్ రూల్స్‌తో పని లేదన్నట్లుగా నేరుగా బ్యాటర్‌కి రెండు, మూడు అడుగుల దూరం నుంచి బంతిని విసరడాన్ని మీరు గమనించవచ్చు. అది కాస్త వెళ్లి బ్యాటర్ కంటి మీద తగులుతుంది. అంతే ఏమి తెలియనట్లుగా బ్యాటర్ ముందు నిలబడి అమాయకపు ఫేస్ పెడతాడు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు..

ఇలా తన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాటర్‌పై బంతి విసిరిన ఈ బుడతడు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌గా మారాడు. అలాగే అతనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ‘ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపే బౌలర్ దోరికేశాడ’ని తెగ సంబరపడిపోతున్నాడు. ఇంకా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాటర్లను అలా కొడితే చాలని, బూమ్రా ప్రో మ్యాక్స్ దొరికేశాడని, ప్రాక్టీస్ మొదలెట్టేశాడని ఇలాంటి బౌలర్లు ఉంటే ఆర్‌సీబీ నిరభ్యంతరంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో ‘ఈ సాలా కప్ నమ్దే’నని చెప్పుకోవచ్చంటూ రాసుకొస్తున్నారు. కాగా ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 67 వేల లైకులు, 52 లక్షల వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed