ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం,ఎయిర్ పోర్ట్ సమీపంలో నివసరించే వారు విమానాల శబ్దం వల్ల ప్రతి రాత్రి కనీస నిద్రను పొందడం లేదనే నిజం బయటపడింది.

ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం, ఎయిర్ పోర్ట్ సమీపంలో నివసరించే వారు విమానాల శబ్దం వల్ల ప్రతి రాత్రి కనీస నిద్రను పొందడం లేదనే నిజం బయటపడింది. ఈ ప్రమాదం పశ్చిమ యునైటెడ్ స్టేట్స్‌లో నివసించే వారికి, ముఖ్యమైన కార్గో విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నవారిలో వినికిడి లోపం ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (BUSPH), ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ ఒక కొత్త విశ్లేషణను నిర్వహించాయి, విమాన శబ్దం మనిషి ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం చూపుతోందని, పరిశోధనలో తేలింది.

ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పెర్స్‌పెక్టివ్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ఫలితాలు, 45 dB కంటే తక్కువ స్థాయిలో విమానం శబ్దానికి గురైన వారు ప్రతి రాత్రి 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఫలితంగా రోజువారీ శారీరక మరియు మానసిక పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. తగినంత నిద్ర లేకపోవడం హృదయ సంబంధ వ్యాధులు, నిరాశ, మధుమేహం, క్యాన్సర్, అనేక ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాలను పెంచుతుంది.

చాలా మంది నిపుణులు ఆరోగ్యకరమైన పనితీరు కోసం ప్రతి రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అధ్యయనంలో విమానం శబ్దం కారణంగా నిద్రించే గంటలు తగ్గిపోతున్నాయని తేల్చింది.

ఇవి కూడా చదవండి



అంతేకాదు విమానాశ్రయం తో పాటు రైల్వే స్టేషన్ సమీపంలో నివసించే వారు సైతం ఇలాంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. తరచూ రైళ్లు శబ్దాలతోని సమీపంలో నివసించే వారి నిద్ర నాణ్యత తగ్గిపోతోందని ఫలితంగా వారిలో హై టెన్షన్ హైబీపీ అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక మనిషికి కనీసం ప్రతిరోజు 7 గంటల నిద్ర అత్యవసరం లేకపోతే అతని శరీరంలో బయలాజికల్ క్లోత్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఫలితంగా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదలై, ఒత్తిడిని మరింత పెంచుతుంది.

నిద్రతో పాటు విమానాశ్రయం, రైల్వే స్టేషన్ సమీపంలో నివసించే వారిలో శృంగారం జీవితం కూడా ప్రభావితం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడు గంటల తప్పనిసరి నిద్ర ప్రశాంతమైన నిద్ర ఫలితంగా శరీరం అనేక హార్మోన్లను విడుదల చేస్తుందని ఫలితంగా, ఆకలి, జీర్ణశక్తి పెంపుతాయని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా నిద్ర లేకపోతే జీర్ణశక్తి కూడా లోపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. . ఇందులో వాస్తవం లేకపోలేదు ఎందుకంటే మనం నిద్రించినప్పుడే రాత్రి తీసుకున్న ఆహారం సక్రమంగా అరుగుతుంది అదేవిధంగా కిడ్నీలు కూడా సక్రమంగా పనిచేస్తాయి గుండెపై కూడా భారం తగ్గుతుంది. మెదడు కూడా నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు శరీరం మొత్తం క్లీన్ చేసుకోవడానికి తెల్ల రక్తకణాలకు సమయం లభిస్తుంది.

అందుకే ప్రతిరోజు 7 గంటల నిద్ర అనేది అత్యవసరం అనే చెప్పాలి. ఒకవేళ మీరు విమానాశ్రయం సమీపంలో కానీ రైల్వే స్టేషన్ సమీపంలో కానీ నివసిస్తున్నట్లయితే వెంటనే అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. లేదా మీ గదిని దళసరి అద్దాలతో సౌండ్ ప్రూఫ్ గా మార్చి చూడండి తద్వారా తక్కువ శబ్దం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా చెవిలో కాటన్ బాల్స్ పెట్టుకోవడం ద్వారా కూడా శబ్దాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed