Health Tips: మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషించే పండ్లు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని రకాల పండ్లు, కూరగాయలను ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. ముఖ్యంగా పరకడుపున..

Foods avoid on early Morning with Empty Stomach

Health Tips: మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషించే పండ్లు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని రకాల పండ్లు, కూరగాయలను ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. ముఖ్యంగా పరకడుపున అసలు పట్టుకోకూడదు. అలా కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాటిని తింటే ఆరోగ్య సమస్యలు తప్పవు. మరి నిపుణుల ప్రకారం ఉదయాన్నే తినకూడని ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సిట్రస్‌ జాతి పండ్లు: నారింజ, ద్రాక్షపండ్ల వంటి సిట్రస్ జాతి పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్, ఫ్రక్టోజ్ జీవక్రియలను నెమ్మదించేలా చేయడంతో పాటు జీర్ణ సమస్యలు, గుండెల్లో మంటను కలిగిస్తాయి. సిట్రస్ పండ్లు చర్మానికి చాలా ఆరోగ్యకరమైనవి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకుండా చూసుకోవాలి.

స్పైసీ ఫుడ్స్‌: ఉదయం పూట స్పైసీ ఫుడ్స్, మిరపకాయలు తినడం కూడా మానుకోవాలి. ఎందుకంటే అవి ఆమ్ల ప్రతిచర్యలు, తిమ్మిర్లను కలిగించి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అలాగే, రోజంతా ఆరోగ్యాన్ని ఇబ్బందికరంగా తయారు చేస్తుంది.

ఇవి కూడా చదవండి



స్వీట్స్‌: ఉదయం నిద్ర లేవగానే చాక్లెట్లను తినకుండా చూసుకోవాలి. వీటిలో ఉండే చక్కెర కంటెంట్ ఇన్సులిన్ స్థాయిలను వెంటనే పెరిగేలా చేయడంతో పాటు తర్వాతి రోజుల్లో ప్యాంక్రియాస్‌కు హాని కలిగిస్తుంది. స్వీట్స్‌ కాకుండా ఇతర చక్కెర ఆహారాలను కూడా దూరం పెట్టడం మంచింది.

ఎరేటెడ్‌ డ్రింక్స్‌: ఉదయాన్నే సోడా వంటి ఎరేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను నెమ్మదించడంతో పాటు కడుపుకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. శ్లేష్మ పొరను దెబ్బతీస్తుంది.

కూరగాయలు‌: క్యారెట్ వంటి పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినకుండా చూసుకోవాలి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే అపానవాయువు, వికారం, గ్యాస్, కడుపు నొప్పికి కూడా దారితీస్తుంది.

కాఫీ: కాఫీప్రియులు ఉదయం పూట తమకెంతో ఇష్టమైన పానీయం తాగడాన్ని తప్పనిసరిగా మానుకోవాలి. ఉదయం పూట కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ ఏర్పడి కడుపు ఉబ్బరం, వాంతులు మొదలవుతాయి. కాఫీ తీసుకునే ముందు ఏదైనా తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండ్లు: అరటిపండ్లు చాలా ఆరోగ్యకరమైనవి. అయినప్పటికీ వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అరటిపండ్లలో ఉండే మెగ్నీషియం శరీరంలో రక్త స్థాయిలను పెంచడంతోపాటు గుండె సమస్యలకు దారితీస్తుందంట.

పులియబెట్టిన పాల ఉత్పత్తులు: పెరుగు వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులను ఖాళీ కడుపుతో తినకుండా చూడాలి. ఇవి జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఎక్కువ ప్రయోజనాలు కలగాలంటే మాత్రం ఇతర ఆహారాలు తీసుకొన్న తర్వాతనే వీటిని తినాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed