11 రోజులు.. 264 గంటలు.. రివెంజ్ కోసం ఎదురు చూశాడు.. కట్ చేస్తే.. తెలుగోడి దెబ్బ ఏంటో రుచి చూపించాడు. ధోని స్టైల్‌లో కిర్రాక్ ఫినిషింగ్ ఇచ్చి లెక్క సరిచేశాడు.

11 రోజులు.. 264 గంటలు.. రివెంజ్ కోసం ఎదురు చూశాడు.. కట్ చేస్తే.. తెలుగోడి దెబ్బ ఏంటో రుచి చూపించాడు. ధోని స్టైల్‌లో కిర్రాక్ ఫినిషింగ్ ఇచ్చి లెక్క సరిచేశాడు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా.? ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ. ఈ 20 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రత్యర్ధి గడ్డపై విన్నింగ్ రన్స్ కొట్టి లెక్క సరిపెట్టాడు. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రెండుసార్లు ఫైట్ జరిగింది. ఒకటి ఏప్రిల్ 22న వాంఖడే స్టేడియం వేదికగా సాగింది. ఇందులో చివరి ఓవర్‌కు ముంబై విజయం సాధించాలంటే కావాల్సింది 16 పరుగులు. ఆ సమయంలో ఆర్షదీప్ బౌలింగ్.. క్రీజులో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ 4 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ సమయంలో తిలక్ వర్మ బౌల్డ్ నెట్టింట పెద్ద సెన్సేషన్ అయింది.

11 రోజులు.. 264 గంటలు..

బుధవారం మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మరోసారి మ్యాచ్ జరిగింది. ఈసారి తిలక్ వర్మ.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సూపర్బ్ సిక్స్ కొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సాధించింది. 75 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తిలక్ వర్మ చివర్లో 10 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి మ్యాచ్ విన్నర్ అయ్యాడు.

ఒకే ఓవర్‌లో 3 బౌండరీలు..

ఈసారి ఆర్షదీప్ బౌలింగ్‌ను తిలక్ వర్మ చీల్చిచెండాడాడు. చివరి ఓవర్‌లో తిలక్ సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. అంతకుముందు, 17వ ఓవర్లో అర్షదీప్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed