ఐపీఎల్ 16వ సీజన్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీలు మైదానంలో వాగ్వాదానికి దిగడం ఈ లీగ్ చరిత్రలో తొలిసారి కానేకాదు. ఐపీఎల్ చరిత్రలో ఇలా చాలానే చోటు చేసుకున్నాయి.
May 04, 2023 | 9:08 PM







లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
Venkata Chari |
Updated on: May 04, 2023 | 9:08 PM
May 04, 2023 | 9:08 PM
ఐపీఎల్ 16వ సీజన్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీలు మైదానంలో వాగ్వాదానికి దిగడం ఈ లీగ్ చరిత్రలో తొలిసారి కానేకాదు. ఐపీఎల్ చరిత్రలో ఇలా చాలానే చోటు చేసుకున్నాయి.
ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ చర్చనీయాంశమైన కొన్ని సన్నివేశాలను అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. 16వ సీజన్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య హోరాహోరీ పోరు జరిగినప్పుడు.. జెంటిల్‌మన్ ఆటకు ఇబ్బందికరంగా మారిన క్షణాలను అందరూ గుర్తు చేసుకున్నారు.
హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన తొలి సీజన్‌ను ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద పోరుగా నిలిచింది. దీని తర్వాత హర్భజన్ సీజన్ మొత్తం ఆడకుండా నిషేధం విధించారు.
2014లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో కీరన్ పొలార్డ్, మిచెల్ స్టార్క్‌ల మధ్య చాలా గొడవలు జరిగాయి. పొలార్డ్ కోపంతో తన బ్యాట్‌ని మైదానంలోకి విసిరాడు. ఈ సమయంలో అంపైర్లు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు.
2013 సీజన్‌లో తొలిసారిగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మైదానంలో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కోహ్లి ఔట్ అయ్యి పెవిలియన్‌కు వెళుతుండగా.. ఆ సమయంలో తోటి ఆటగాళ్లు విడదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2012 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న అంబటి రాయుడు బ్యాటింగ్ సమయంలో RCB బౌలర్ హర్షల్ పటేల్‌తో గొడవపడ్డాడు. దీని తర్వాత, రాయుడుకు 100 శాతం మ్యాచ్ ఫీజు మినహాయించగా, హర్షల్‌కు 25 శాతం జరిమానా పడింది.
ఐపీఎల్ 16వ సీజన్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన పోరు కచ్చితంగా ఈ జాబితాలో చేరిపోతుంది. మ్యాచ్ అనంతరం ఇద్దరి మధ్య పోరు జరిగిన తీరుతో తోటి ఆటగాళ్లు కూడా వారిని శాంతింపజేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.