సోషల్ మీడియాలో రజినీ ఫ్యాన్స్.. వైసీపీ నాయకుల మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇక ఈ వివాదంపై టాలీవుడ్ నటుడు జగపతి బాబు స్పందించారు. ప్రస్తుతం ఆయన నటించిన రామబాణం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న జగపతి బాబుకు రజినీకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

Jagapathi Babu, Rajinikanth

ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్.. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. విజయవాడలో జరిగిన ఈ వేడుకలలో నందమూరి హీరో బాలకృష్ణ ఆయనను రిసీవ్ చేసుకున్నారు. రజినీకి.. నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొనడమే కాకుండా తారకరామారావు, చంద్రబాబు, బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు. దీంతో ఆయనపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య, చంద్రబాబు పై పొగడంతో కొందరు వైసీపీ నాయకులు రజినీకాంత్ పై దారుణంగా విమర్శలు గుప్పించారు. కొన్ని సందర్భాల్లో ఆయన స్థాయిని తగ్గించి మరీ కామెంట్స్ చేశారు. దీంతో రజినీ ఫ్యాన్స్ వైసీపీ నాయకులపై సీరియస్ అయ్యారు. అసలు ఈ వేడుకలలో రజినీ ఏపీ రాజకీయాలపై మాట్లాడలేదని.. కేవలం నందమూరి కుటుంబంతో తనకున్న స్నేహం.. ఎన్టీఆర్ పై పొగడ్తలు కురిపించారని.. విషయం గమనించకుండా దారుణంగా విమర్శించడమేంటనీ ఆగ్రహం వ్యక్తం చేశారు రజినీ ఫ్యాన్స్.

దీంతో సోషల్ మీడియాలో రజినీ ఫ్యాన్స్.. వైసీపీ నాయకుల మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇక ఈ వివాదంపై టాలీవుడ్ నటుడు జగపతి బాబు స్పందించారు. ప్రస్తుతం ఆయన నటించిన రామబాణం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న జగపతి బాబుకు రజినీకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజినీకాంత్ ప్రసంగంపై గురించి వైసీపీ నేతలు చేసిన విమర్శలపై మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు జగపతి బాబు స్పందిస్తూ.. “నేను ఎక్కువగా టీవీలు చూడను. పత్రికలు చదవను. దాంతో ఆయన ఏం మాట్లాడారు ? ఎవరు విమర్శించారనేది నాకు అవగాహన లేదు. అయితే రజినీకాంత్ నవ్విస్తూ… చక్కగా నిజాలు మాట్లాడతాడు. తనని అనేవాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చారు.

రజినీతో జగపతి బాబు రెండు సినిమాల్లో నటించారు. అందులో కథానాయకుడు చిత్రంలో రజినీ స్నేహితుడిగా.. లింగ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు జగపతి బాబు. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్ఎంబీ 28, సలార్ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *