మరి గర్భిణులు ఈ సమస్యను ఎలా ఎదుర్కొవాలి? ఈ అసౌకర్యాన్ని ఎలా అధిగమించాలి? అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానం చెబుతున్నారు. కొన్ని జీవన శైలి మార్పులు చేసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు.

అమ్మతనం అనేది వెలకట్టలేని అనుభవం. ఒక స్త్రీ గర్భం దాల్చినది మొదలు కొని సుఖ ప్రసవం అయ్యే వరకూ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ.. వైద్యులు, ఇంట్లో వాళ్లు, ఇరుగుపొరుగు వాళ్లు చెప్పే అన్ని సూచనలు పాటిస్తూ.. మరో ప్రాణిని భూమి మీదకు తీసుకొస్తారు. ఈ క్రమంలో వారు మరో జన్మ ఎత్తుతారు. ఈ తొమ్మిది నెలల్లో స్త్రీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. ఇవన్నీ భరిస్తూ గర్భాన్ని మోయవలసి వస్తుంది. వాటిల్లో సాధారణమైన సమస్య జీర్ణ సమస్య. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. కడుపు నిండుగా అనిపించడం, ఛాతీలో మంట, ఉబ్బరం మొదలైనవి గర్భిణిలులో సాధారణంగా కనిపించే లక్షణాలు.ఈ లక్షణాలు ఏదైనా తిన్న తర్వాత లేదా భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు సంభవించవచ్చు.

అందరిలోనూ కనిపిస్తుంది..

సాధారణంగా యాసిడ్ రిఫ్లక్స్ అందిరినీ వేధిస్తుంది. కాస్త ఎక్కువగా తిన్నా, శరీర తత్వానికి పడని పదార్థాలు తిన్నా.. మషాలాలు అధికంగా ఉండేవి తిన్నా ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తుంది. అయితే కడుపులో పిండాన్ని మోస్తున్న స్త్రీలలో ఈ సమస్య ప్రభావం అధికంగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ అనేది కడుపులో ఆమ్లాల అధిక ఉత్పత్తిని సూచిస్తుంది. ఆ యాసిడ్స్ కడుపు నుంచి అన్నవాహికలోకి వస్తుంటాయి. ఇది తరచూగా జరిగితే దీనిని గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (జీఈఆర్డీ)గా పిలుస్తారు.

దీనిని ఎలా ఎదుర్కొవాలి..

మరి గర్భిణులు ఈ సమస్యను ఎలా ఎదుర్కొవాలి? ఈ అసౌకర్యాన్ని ఎలా అధిగమించాలి? అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానం చెబుతున్నారు. కొన్ని జీవన శైలి మార్పులు చేసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం..

ఇవి కూడా చదవండి  • అధిక నూనె, ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడాన్ని తగ్గించాలి.
  • ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.
  • అలాగే ఒకేసారి ఆహారం తీసుకోకుండా.. వరుస విరామాలలో ఆహారాన్ని తగుమోతాదులో తీసుకోవాలి.
  • మీ భోజనానికి నిద్రకు మధ్య కనీసం 1-2 గంటల ఖాళీ సమయాన్ని ఉంచండి.
  • ఎల్లప్పుడూ నిటారుగా ఉండే భంగిమలోనే ఆహారాన్ని తీసుకోండి.
  • ఎప్పుడూ ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్ గా ఉండటానికి ప్రయత్నించండి.
  • గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ మూడు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగాలి.
  • ప్రతి రోజూ వాకింగ్ తప్పనిసరి. కనీసం 15 నిమిషాలు వాకింగ్ చేయడం ఉత్తమం.
  • ఏదైనా ఇబ్బందులు తలెత్తనప్పుడు సొంత వైద్యం చేయకూడదు. మీ వైద్యుడి సలహా మేరకు నిర్ణయాలు తీసుకోవాలి.
  • ఒకవేళ మీకు ధూమపానం అలవాటు ఉంటే వెంటనే దానిని మానుకోవాలి.

యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యను ఎదుర్కొనడానికి ఇవి కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు. అయితే సమస్య అధికంగా ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ ఉత్తమం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *