ఇప్పటివరకు సౌత్ ఇండియాలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న బన్నీకి.. పుష్ప మూవీతో నార్త్ ఇండస్ట్రీలోనూ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పక్కా ఊర మాస్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటన అదరగొట్టారు. దీంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న చిత్రం పుష్ప. డైరెక్టర్ సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా.. ఈ మూవీ బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటివరకు సౌత్ ఇండియాలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న బన్నీకి.. పుష్ప మూవీతో నార్త్ ఇండస్ట్రీలోనూ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పక్కా ఊర మాస్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటన అదరగొట్టారు. దీంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప సినిమాలో బన్నీ పాత్రతో పాటు.. హైలెట్ అయిన మరో రోల్ భన్వర్ సింగ్ షెకావత్. ప్రథమార్థంలో పుష్పరాజ్ కు, షెకావత్‏కు మధ్య అసలైన వార్ మొదలవుతుంది. ఇక వీరిద్దరి మధ్య వివాదం ఏ స్థాయిలో ఉండనుంది అనేది సెకండ్ పార్ట్ లో తెలియబోతుంది. ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటించారు. అయితే ఆయనకంటే ముందు ఈ రోల్ కోసం సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోను సంప్రదించారట మేకర్స్. అతను రిజెక్ట్ చేయడంతో ఈపాత్ర ఫహద్ వద్దకు చేరినట్లుగా సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా ?.

ఈ మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం సుకుమార్ ముందుగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించారట. కానీ అప్పటికే వరసు సినిమాలతో బిజీగా ఉన్న సేతుపతి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ మూవీని వదులుకున్నారట. దీంతో ఈ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ ను ఎంపిక చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. భన్వర్ సింగ్ పాత్రలో విజయ్ సేతుపతి నటించి ఉంటే పుష్ప మరోలా ఉండేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండిVijay Sethupathi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *