Indian Premier League: ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమవుతాడనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి. దీంతో ఎట్టకేలకు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. రాహుల్ స్థానంలో ఆ మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతలను ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా నిర్వహించాడు.

సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన కేఎల్..

ఊహాగానాలపై కేఎల్ రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. గాయం తీవ్రమవడంతో సర్జరీ చేయాలని డాక్టర్లు తెలిపారు. దీంతో ఐపీఎల్ తర్వాతి మ్యాచ్‌లతోపాటు, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమవుతున్నాను అంటూ సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ ప్రకటించాడు.

ఇప్పుడు రాహుల్ గాయానికి సంబంధించి లక్నో సూపర్ జెయింట్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాహుల్ గాయాన్ని స్కాన్ చేసి కొన్ని పరీక్షలు చేయించుకున్న తర్వాత అతనికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని ఫ్రాంచైజీ తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో మేం రాహుల్‌కు పూర్తి మద్దతునిస్తాం, తద్వారా అతను మరింత మెరుగ్గా కోలుకుంటాడు. ఆయన జట్టుతో లేకపోవడం కచ్చితంగా లోటే. త్వరలో మళ్లీ కెఎల్‌ను మైదానంలో చూడాలని కోరుకుంటున్నాం’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed