ఈ హీరో ప్రయాణం పూలపాన్పేమీ కాదు. మధ్యలో అరడజనుకు పైగ ప్లాఫులు అందుకున్నాడు. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. రెండు బ్లాక్ బస్టర్‌ హిట్‌ సినిమాలు ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతా బాగుందనుకున్న తరుణంలో ఒక ప్రమాదం అతని జీవితాన్ని తల్లకిందులు చేసింది.

పై ఫొటోలో పంచెకట్టుతో సముద్రం వైపు చూస్తోన్నది ఓ స్టార్‌ హీరో. బడా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ఓ సపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను ఏర్పరచ్చుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలోనే వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు. అలాగనీ ఈ హీరో ప్రయాణం పూలపాన్పేమీ కాదు. మధ్యలో అరడజనుకు పైగ ప్లాఫులు అందుకున్నాడు. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. రెండు బ్లాక్ బస్టర్‌ హిట్‌ సినిమాలు ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతా బాగుందనుకున్న తరుణంలో ఒక ప్రమాదం అతని జీవితాన్ని తల్లకిందులు చేసింది. సుమారు ఏడాదికి పైగా కెమెరాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే అభిమానుల ప్రార్థనలతో పూర్తిగా కోలుకున్నాడు. మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నాడు. ఏకంగా 100 కోట్ల సినిమాను ఖాతాలో వేసుకుని బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. మరి ఈపాటికే ఈ హీరో ఎవరే అర్థమై ఉంటుంది. ఎస్‌.. ఈ ఫొటోలో ఉన్నది మరెవరో కాదు సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌. విరూపాక్షతో ఫుల్‌ జోష్‌లో ఉన్న అతను తాజాగా సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేశాడు.

తెలుగులో వంద కోట్ల వైపు అడుగులు వేస్తోన్న విరూపాక్ష ఇప్పుడు ఇతర భాషల్లోనూ రిలీజయ్యింది. హిందీ, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం మూవీ టీమ్‌ పాన్‌ ఇండియా రేంజ్లో ప్రమోషన్లు చేస్తోంది. సాయి ధరమ్‌ తేజ్‌ కూడా కొచ్చిన్‌, చెన్నై, ముంబై లాంటి ప్రముఖ నగరాల్లో విరూపాక్ష ప్రమోషన్లు నిర్వహించాడు. అలా ప్రమోషన్లలో భాగంగా ఓ బీచ్‌లో దిగిన ఫొటోను తాజాగా ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు తేజ్‌. ఇందులో పంచెకట్టుతో సముద్రం వైపు తీక్షణంగా చూస్తూ ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు మెగా హీరో. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *