MLA Rapaka: 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఎన్నికపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా

MLA Rapaka: 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఎన్నికపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఆదేశాలు జారీచేశారు. ఈ సంవత్సరం మార్చి 24న అంతర్వేదిలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో సదరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటి నుంచో కూడా తమ స్వగ్రామం చింతలమోరికి కొందరు దొంగ ఓట్లు వేయడానికే వచ్చేవారని, ఒక్కొక్కరు 5-10 ఓట్లు వేసేవారని, అవే తన విజయానికి దోహదపడేవని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక రాపాక చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద రాజకీయ దుమారమే రేగింది.

మరోవైపు రాపాక వ్యాఖ్యలపై సఖినేటిపల్లి మండలానికి చెందిన ఎనుముల వెంకటపతిరాజా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏప్రీల్ 24న ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదుచేశారు. తత్ఫలితంగా 2019 అసెంబ్లీ ఎన్నికలలో వరప్రసాద్‌ ఎన్నిక జరిగిన విధానంపై విచారణ నిర్వహించి, వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచించారు.

కాగా, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఫిర్యాదు చేసిన ఎనుముల వెంకటపతిరాజా మాట్లాడుతూ, ‘దొంగ ఓట్లతో నెగ్గినట్లు రాపాక స్వయంగా తన నోటితోనే ఒప్పుకొన్నారు. ఆయన ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగింది. కాబట్టి కలెక్టర్‌ ఆధ్వర్యంలో రాపాకను నిష్పక్షపాతంగా విచారణ చేసి కాలయాపన లేకుండా తదనుగుణమైన చర్యలు తీసుకోవాలి’ అని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *