లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మే 1న జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండింయా మాజీలు కొందరు మండిపడుతుండగా.. మరి కొందరు సర్దిచెప్పే..

Gautham Gambhir, Virat Kohli for Sprite Ad

లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మే 1న జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండింయా మాజీలు కొందరు మండిపడుతుండగా.. మరి కొందరు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నెటిజన్లు కూడా ఇద్దరి మధ్య జరగిన గొడవపై విపరీతమైన మీమ్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వాగ్వాదంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరదాగా స్పందించాడు. వారిద్దిని కలిపి చల్లచల్లగా ఉంచే స్ప్రైట్ కూల్ డ్రింక్ యాడ్ చేయించుకోవాలని సూచించాడు. అవును, ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా కామెంట్ కూడా చేశాడు యూవీ. ఇక అది కాస్త ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

యూవీ తన ట్వీట్‌లో ‘I think #Sprite should sign #Gauti and #Cheeku for their campaign #ThandRakh 🤪🥶 what say guys? 😎 @GautamGambhir @imVkohli @Sprite’ అంటూ రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ ఇది చక్కని జోడి ఎంపిక అని కామెంట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ల మధ్య ఇప్పుడు ఉన్న వేడి తగ్గాలంటే స్ప్రైట్ తాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరైతే ఏకంగా స్ప్రైట్ కంపెనీని మెన్షన్ చేసి ‘కోహ్లీ, గంభీర్ జోడిని మీ యాడ్స్ కోసం తీసుకోకపోతే ఇకపై మీ డ్రింక్స్‌కి దూరంగా ఉంటాం’ అంటూ రాసుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి



కాగా, భారత్‌కు రెండో సారి అంటే 2011లో ‘వరల్డ్ కప్’ అందించిన టీమ్‌లో యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కూడా సభ్యులే. వరల్డ్ కప్ 2011 టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన యువీ 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో కలిపి 362 పరుగులు చేశాడు. మరోవైపు తన బౌలింగ్‌తో కూడా ఏకంగా 15 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు గౌతమ్ కూడా ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులతో విజృంభించడంతో పాటు టోర్నీలో 393 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థశతకాలు కూడా ఉన్నాయి. ఇక కింగ్ కోహ్లీ అయితే ఒక సెంచరీ, ఒక హఫ్ సెంచరీతో సహా మొత్తం 282 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *