ఇప్పుడు రామబాణం సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. మ్యాచో స్టార్ గోపిచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా రేపు (మే5న) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ప్రెస్ మీట్ లో పాల్గొన్న జగపతి బాబు.. ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాగా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరో జగపతి బాబు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన జగపతి బాబు.. ఇప్పుడు ప్రతినాయకుడిగా మెప్పిస్తున్నారు. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన.. లెజెండ్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేశారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా జగపతిబాబు అదరగొట్టారు. దీంతో ఆయనకు విలన్ పాత్రలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అటు ప్రతినాయకుడిగా.. ఇటు సహయ నటుడిగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రామబాణం సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. మ్యాచో స్టార్ గోపిచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా రేపు (మే5న) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ప్రెస్ మీట్ లో పాల్గొన్న జగపతి బాబు.. ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాగా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందా? ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇందులో జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తాను కేవలం ఐదు రోజుల షెడ్యూల్ లో మాత్రమే పాల్గొన్నానని చెప్పారు. ఆ ఐదు రోజులు ఒకే ఒక్క సన్నివేశం చిత్రీకరించారని అన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసాధారణమైన టాలెంట్ కలిగిన వ్యక్తి అని.. అందుకే తాను సలార్ సినిమా స్టోరీ గురించి.. తన క్యారెక్టర్ గురించి ఎక్కువగా అడగలేదని.. ఇలాంటి టీంతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

అయితే కేవలం ఐదు రోజులలో ఒకే ఒక్క సీన్ షూట్ జరిగింది.. అది పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న నటుడు కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందా ?.. అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తుండగా.. ఆమె తన రోల్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసింది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డే్ట్స్ రాలేదు..

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed