Venkata Chari |

Updated on: May 05, 2023 | 3:18 PM

KL Rahul Ruled Out: RCBతో జరిగిన మ్యాచ్‌లో తొడకు తీవ్ర గాయం కావడంతో కేఎల్ రాహుల్ IPL 2023 నుంచి వైదొలిగాడు. అంతేకాకుండా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆడడం కూడా సందేహాస్పదంగా ఉందని క్రిక్‌బజ్ నివేదించింది.

May 05, 2023 | 3:18 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ నుంచి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నిష్క్రమించాడు. అయితే, ఇది ఎల్‌ఎస్‌జీ జట్టుకు ఇది పెద్ద షాక్. అలాగే భారత క్రికెట్ జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.

సోమవారం (మే 1) లక్నోలోని ఎకానా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తొడకు బలమైన గాయం కావడంతో రాహుల్ IPL 2023 నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా, ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆడడం కూడా కష్టమేనని క్రిక్‌బజ్ నివేదించింది.

ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. అందుకే 2వ ఓవర్ తర్వాత ఫీల్డింగ్ చేయలేదు. అలాగే, అతను 11వ నంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చినప్పటికీ, అతను పరుగెత్తే స్థితిలో లేడు. ఇప్పుడు తొడకు గాయం కావడంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కేఎల్ రాహుల్ ఇప్పటికే లక్నో ఫ్రాంచైజీని విడిచిపెట్టి ముంబైకి వెళ్లనున్నారు. అక్కడ అతను తొడ గాయానికి స్కానింగ్ చేయించుకున్నాడు. అయితే స్కానింగ్ రిపోర్టుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరూ వెల్లడించలేదు. దీనిపై లక్నో ఫ్రాంచైజీకి ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్నారు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం. 1వ ర్యాంక్‌లో ఉన్న భారత్ జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. దీని నుంచి కూడా రాహుల్ బయటపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రాహుల్ గైర్హాజరీలో కృనాల్ పాండ్యా లక్నోలో జరగనున్న మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఒకవేళ రాహుల్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు దూరమైతే, మయాంక్ అగర్వాల్ లేదా ఇషాన్ కిషన్ ఎంపికయ్యే అవకాశం ఉంది.

రాహుల్ తుంటి గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. అతని చికిత్సను పర్యవేక్షిస్తున్న జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) గురువారం రాత్రి వరకు జట్టు మేనేజ్‌మెంట్‌తో సహా సంబంధిత ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. అయితే రాహుల్ గాయం ఏ స్థాయిలో ఉందనే విషయంపై క్లారిటీ లేదు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed