మెగాస్టార్‌ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. స్వయంకృషితో సినిమాల్లో ఆయన ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శనీయం. కోట్లాది మంది చిరంజీవిని అభిమానించడానికి కారణం ఆయన చేసిన సినిమాలే కాదు.. ‘రియల్ హీరో’గా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు.

మెగాస్టార్‌ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. స్వయంకృషితో సినిమాల్లో ఆయన ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శనీయం. కోట్లాది మంది చిరంజీవిని అభిమానించడానికి కారణం ఆయన చేసిన సినిమాలే కాదు.. ‘రియల్ హీరో’గా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు. ఐ బ్యాంక్‌, బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుచేసి ఎంతోమందికి ప్రాణం పోసిన ఆయన కరోనా కాలంలో ఆక్సిజన్‌ బ్యాంకును ఏర్పాటుచేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా కొనసాగుతున్న ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సాయం కోరి వెళ్లిన వారందరికీ కాదనకుండా హెల్ప్‌ చేస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి మంచి మనసుకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న కాలంలో తాను చదువుకున్న కాలేజీకి రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారట చిరంజీవి. ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ వైఎన్ కాలేజీకి ఎంతో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం సినిమా, రాజకీయ, ఇతర రంగాల్లో ఉన్న ఎంతో మంది ప్రముఖులు ఈ కళాశాలలో చదువుకున్న వారే. అందులో మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు, డైరెక్టర్ దవళ సత్యం, గజల్ శ్రీనివాస్, పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు ఇదే కాలేజీలో చదువుకున్నారు. సుమారు 74 సంవత్సరాలు చరిత్ర ఉన్న ఈ కాలేజీ వచ్చే ఏడాది ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకోనుంది. ఈక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ సత్యనారాయణ ఒక ఛానెల్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘వైఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించినప్పుడు చిరంజీవి వచ్చారు. మాతో చాలా సమయం గడిపారు. గతంలో ఎంపీ నిధుల నుంచి కాలేజీకి రూ.50 లక్షలు ఇచ్చారాయన. ఈసారి తన సొంత నిధులు ఇస్తానని మెగాస్టార్‌ మాటిచ్చారు. ఎప్పుడైనా చిరంజీవిని కలిస్తే ఆయన చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు’ అని చెప్పుకొచ్చారు సత్యనారాయణ.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed