వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో కొందరిపై పరోక్ష విమర్శలు చేశారు. ఓ దశలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనపై నిందలు ఆరోపణలు భరించలేకపోతున్నానని కంటతడి పెట్టారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని వాపోయారు. గొనె ప్రకాశ్‌రావుకి వైవీ సుబ్బారెడ్డి దేవుడిగా కనిపిస్తే అభ్యంతరం లేదు..కాని తన గురంచి మాట్లాడాల్సిన అవసరం ఏంటని బాలినేని ప్రశ్నించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారాలు కూడా చేస్తున్నారని.. ఇవన్ని ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని విమర్శించారు. ఒంగోలులో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. కానీ ఇతర నియోజక వర్గాల్లో ఇలాంటి వాటిని చూడలేకపోతున్నానని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!