ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మానసిక ఆందోళన, అధిక ఒత్తిళ్లు, తినే ఆహారం తదితర కారణాల వల్ల మనషి రోగాల బారిన పడుతున్నాయి. ఇక ఆహారం తీసుకోవడంలో కూడా సమయ వేళలు పాటించడం ఎంతో ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. తినే..

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మానసిక ఆందోళన, అధిక ఒత్తిళ్లు, తినే ఆహారం తదితర కారణాల వల్ల మనషి రోగాల బారిన పడుతున్నాయి. ఇక ఆహారం తీసుకోవడంలో కూడా సమయ వేళలు పాటించడం ఎంతో ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. తినే ఆహారం విషయంలో సమయ వేళలు పాటించకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. చాలా మంది తినే ఆహారం విషయంలో సమయ సందర్భాలు పాటించరు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకొని, సరైన నిద్రపోవాలని, లేకపోతే ఒబిసిటి, హృద్రోగ సమస్యలతో బాధపడటం తప్పదని సూచిస్తున్నారు.

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే..

కాగా, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా రాత్రిపూట 9 గంటల తర్వాత భోజనం చేసే వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. అందుకే రాత్రి 9 గంటల లోపే భోజనం చేయాలని సూచిస్తున్నారు. అంతేకాదు రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయడం వల్ల డయాబెటిస్‌ -2, గుండె జబ్బులు తప్పవంటున్నారు. అందుకే పడుకునే సమయానికి మూడు గంటల ముందు భోజనం చేయాలని సూచిస్తున్నారు. భోజనం విషయంలో సరైన సమయాలు పాటించాలని, లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు.

అందుకే రాత్రి సమయంలో భోజనం చేసే ముందు సమయ వేళలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఆలస్యంగా భోజనం చేసే వారి చాలా మంది ఉంటారు. 10 గంటల తర్వాత భోజనం చేసేవారు చాలా ఉంటారు. కొందరేమో రాత్రి 11లకు భోజనం చేస్తుంటారు. అలా కాకుండా నిద్రకు కనీసం మూడు గంటల ముందైనా భోజనం చేస్తే చాలాంటున్నారు వైద్య నిపుణులు.

ఇవి కూడా చదవండిమరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *