Babar Azam Records: బాబర్ ఆజం వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బాబర్ కేవలం 97 ఇన్నింగ్స్‌ల్లోనే హషీమ్ ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం తాజాగా వన్డే క్రికెట్‌లో మరో భారీ రికార్డు సృష్టించాడు. బాబర్ వన్డేల్లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బాబర్ కంటే ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ వెటరన్ ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 101 ఇన్నింగ్స్‌లలో వన్డే ఫార్మాట్‌లో 5,000 పరుగులు పూర్తి చేశాడు.

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో బాబర్ అజామ్ ఈ రికార్డును సాధించాడు. బాబర్ ఇప్పుడు వన్డేల్లో కేవలం 97 ఇన్నింగ్స్‌లలో ఈ స్థానాన్ని చేరుకుని అనుభవజ్ఞులందరినీ వెనక్కునెట్టాడు. ఈ జాబితాలో ఇప్పుడు బాబర్ మొదటి స్థానంలో ఉండగా, హషీమ్ ఆమ్లా రెండో స్థానానికి చేరుకున్నాడు.

వెస్టిండీస్ మాజీ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ వన్డేల్లో 114 ఇన్నింగ్స్‌ల్లో 5,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 114 ఇన్నింగ్స్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో 115 ఇన్నింగ్స్‌లతో 5వ స్థానానికి చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి



అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా బాబర్..

వన్డే ఫార్మాట్‌లో, బాబర్ ఆజం తన బ్యాట్‌తో నిరంతరం అనేక రికార్డులను కొల్లకొడుతున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 4,000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడు బాబర్ నిలిచాడు. బాబర్ ఈ స్థానాన్ని 81 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు.

బాబర్ ఆజం ఇప్పటివరకు వన్డే ఫార్మాట్‌లో దాదాపు 60 సగటుతో పరుగులు చేస్తున్నాడు. బాబర్ వన్డేల్లో 17 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బాబర్ వన్డేల్లో 89.24 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *