ప్రభాస్‌,మహేష్ తో  సహా పలువురు సినీ ప్రముఖులు మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా టీజర్‌పై స్పందించారు. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ రివ్యూ ఇచ్చారు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి మూవీ టీజర్‌ చూశాను. చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. టీం సభ్యులకు గుడ్ లక్‌’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు చెర్రీ.

నిశ్శబ్దం రిలీజైన మూడేళ్ల తర్వాత అనుష్కా శెట్టి నటిస్తోన్న చిత్రం మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. టాలీవుడ్‌ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో పి. మహేశ్‌కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనుష్క చెఫ్‌గా నటిస్తుండగా, నవీన్‌ పొలిశెట్టి స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ మూవీ టీజర్‌ను ఇటీవలే రిలీజ్‌ చేశారు మేకర్స్‌. దీనికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రభాస్‌,మహేష్ తో  సహా పలువురు సినీ ప్రముఖులు మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా టీజర్‌పై స్పందించారు. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ రివ్యూ ఇచ్చారు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి మూవీ టీజర్‌ చూశాను. చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. టీం సభ్యులకు గుడ్ లక్‌’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు చెర్రీ. దీనికి హీరోయిన్‌ అనుష్క స్పందించింది. ‘రామ్‌ చరణ్‌కు థ్యాంక్స్‌. మీ సతీమణి ఉపాసనతో కలిసి సినిమా చూడండి’ అని కోరింది.

ఇక రామ్‌ చరణ్‌ ట్వీట్‌పై నవీన్‌ పొలిశెట్టి ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ‘మీ ట్వీట్‌ చూశాను. మాకు తెలియకుండానే నాటు నాటు స్టెప్‌ వేస్తున్నాం. సినిమాల ఎంపికలో మీ నిర్ణయాలతో గేమ్‌ ఛేంజర్‌ అనిపించుకున్నారు. ఇలాంటి విషయాల్లో మాకు స్ఫూర్తిగా ఉన్నందుకు థ్యాంక్యూ’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు నవీన్‌. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాలో సినీయర్ నటీనటులు జయసుధ, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి  

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *