RR vs GT, IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా జరుగుతున్న 48వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు రాజస్థాన్ రాయల్స్ 119 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ 17.5 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది.

Rr Vs Gt Score
RR vs GT, IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా జరుగుతున్న 48వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు రాజస్థాన్ రాయల్స్ 119 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ 17.5 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుత సీజన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇదే అతి తక్కువ స్కోరుగా నిలిచింది. అంతకుముందు, 10వ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 ఏప్రిల్ 2023న లక్నోలో 121 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బెంగళూరుపై లక్నో 108 పరుగులకు ఆలౌట్ అయింది.
రాజస్థాన్ తరపున కెప్టెన్ సంజు శాంసన్ అత్యధికంగా 30 పరుగులు చేశాడు.