ఇప్పటికీ సినీప్రియుల హృదయాల్లో సిల్క్ స్మిత ఓ అందాల తారగా ఉండిపోయింది. ఇటీవల విడుదలైన దసరా సినిమాలో సిల్క్ స్మిత పోస్టర్ కనిపించడంతో మరోసారి ఆమె జీవితం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సిల్క్ స్మిత రూపం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

తెలుగు చిత్రపరిశ్రమలో సిల్క్ స్మిత పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె చక్రం తిప్పింది. ప్రతి సినిమాలోనూ సిల్క్ స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అన్న స్థాయికి వెళ్లింది ఆమె క్రేజ్. నిషా కళ్లతో ప్రేక్షకులను మాయలో పడేసింది. అప్పట్లోనే గ్లామర్ పాత్రలో అలరించింది.ఆమె వెళ్లే దారిలో ఎన్నో ముళ్లున్నా.. వాటిపై నడుస్తూనే చిరునవ్వులు చిందించింది. స్టార్ హీరోస్ సైతం సిల్క్ స్మిత డేట్స్ కోసం ఎదురుచూసేవారు అంటే ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె అందం కోలువుండిపోయింది. దశాబ్దం పాటు సినీ పరిశ్రమలో వందలాది చిత్రాల్లో అలరించిన ఆమె.. చివరకు ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఎంతో మందిని ఆమె మృతి కలిచివేసింది. కానీ చనిపోయిన తర్వాత సినీపరిశ్రమ నుంచి ఏ ఒక్క హీరో … దర్శకనిర్మాతలు వెళ్లలేదు. చివరకు కుటుంబసభ్యులు సైతం ఆమెను చూడాటానికి రాలేదు. దీంతో ఆమెకు ఓ అనాథ శవంలా అంత్యక్రియలు జరిపించారు.

ఇప్పటికీ సినీప్రియుల హృదయాల్లో సిల్క్ స్మిత ఓ అందాల తారగా ఉండిపోయింది. ఇటీవల విడుదలైన దసరా సినిమాలో సిల్క్ స్మిత పోస్టర్ కనిపించడంతో మరోసారి ఆమె జీవితం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సిల్క్ స్మిత రూపం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అచ్చం తనలాగే ఉన్న ఓ అమ్మాయి మరోసారి సిల్క్ స్మితను గుర్తుచేస్తుంది. ఆమెను జూనియర్ సిల్క్ స్మిత అంటున్నారు ఫ్యాన్స్. ఈ అమ్మాయి పేరు విష్ణు ప్రియ.

ఫేస్ కట్ మాత్రమే కాదు. ఎక్స్‌ప్రెషన్స్‌తో సిల్క్‌ స్మితను గుర్తు చేస్తుంది. ఇక విష్ణుప్రియ కూడా సిల్క్ స్మిత పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా.. ఆమెను జూనియర్ సిల్క్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed