ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. బ్యూటీఫుల్ లవ్ స్టోరీలతో ఒకప్పుడు సూపర్ హిట్స్ అందుకున్న ఈ కుర్రాడు.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. సహాయ నటుడిగానూ మెప్పిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?..

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి.. సెలబ్రెటీల వరకు తమ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట షేర్ చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నినెలలుగా పలువురు తారల పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోకు సంబంధించిన టీనేజ్ ఫోటో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారు కదా.. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మధ్యలో నిలబడిన ఆ కుర్రాడు యంగ్ హీరో. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. బ్యూటీఫుల్ లవ్ స్టోరీలతో ఒకప్పుడు సూపర్ హిట్స్ అందుకున్న ఈ కుర్రాడు.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. సహాయ నటుడిగానూ మెప్పిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?..

ఆ కుర్రాడు మరెవరో కాదండి.. అక్కినేని హీరో సుమంత్. 1975 ఫిబ్రవరి 9న హైదరాబాద్ లో జన్మించారు. అక్కినేని నాగేశ్వరరావు మనవలు.. మనవరాళ్లలో సుమంత్ అందరికన్నా పెద్దవాడు. 1999లో ప్రేమకథ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత యువకుడు, స్నేహమంటే ఇదేలా, సత్యం, గౌరి, ధన 51, గోదావరి చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత సుమంత్ నటించిన చిత్రాలు అంతగా హిట్ అందుకోలేకపోయాయి. దీంతో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి..

చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సుమంత్.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇటీవల దుల్కర్ సల్మాన్,మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమాలో కీలకపాత్రలో నటించారు. 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ వీరిద్దరు 2006లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సుమంత్ ఒంటరిగానే ఉంటున్నారు.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed