IPL 2023: విరాట్ కోహ్లి బ్యాట్ పరుగులు తీస్తోంది. ఈ సీజన్‌లోని దాదాపు ప్రతి మ్యాచ్‌లో కీలక సహకారం అందిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఢిల్లీలో ఉన్నాడు. ఇక్కడ కోహ్లీ తన బాల్యాన్ని గడిపాడు.

Virat kohli: విరాట్ కోహ్లి.. తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని మెప్పించిన దిగ్గజ బ్యాట్స్‌మెన్. కింగ్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడంటే బౌలర్ భవితవ్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విరాట్ కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌లో తన బ్యాట్‌తో సత్తా చాటుతున్నాడు. ఆర్‌సీబీ ఇంతవరకు రాణించడానికి ఇదే కారణం. ఇప్పుడు RCB తదుపరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంత మైదానంలో ఆడబోతున్నప్పటికీ, ఢిల్లీ విరాట్‌కి కూడా సొంత ఊరే కావడం విశేషం.

కాగా, ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లి గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. విరాట్ కోహ్లితో క్రికెట్ ఆడే అతని స్నేహితుడు మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి మిల్క్‌మ్యాన్ సైకిల్‌పై వచ్చి మొదటి స్థానంలో నిలిచేవాడంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి



ఛీటింగ్ చేస్తూ దొరికిన విరాట్ కోహ్లీ..

కోచ్ రాజ్‌కుమార్ శర్మ తరచూ ఆటగాళ్లను పరుగులు పెట్టించేవాడని విరాట్ కోహ్లీ స్నేహితుడు ఆర్‌సీబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించాడు. అకాడమీ బయట రోడ్డుపై పరుగులు తీయాలంటూ ఆటగాళ్లను ఆదేశించేవాడు. రన్నింగ్ సర్క్యూట్ మొత్తం 5 కి.మీ. పొడవుగా ఉండేది. అయితే, విరాట్ పరిగెత్తేటప్పుడు వెనుకే ఉండేవాడని కోహ్లీ స్నేహితుడు చెప్పుకొచ్చాడు. కానీ, విరాట్ సైకిల్‌పై పాలు తీసుకెళ్లే వాళ్లను లిఫ్ట్ అడిగి, ముందుకు వచ్చేవాడు. ఇది తరచుగా జరిగేదని కోహ్లీ ఫ్రెండ్ తెలిపాడు. కాగా, కోచ్ రాజ్‌కుమార్ శర్మకు ఈ విషయం తెలిసినా.. ముందున్నందుకు ఎల్లప్పుడూ సంతోషించేవాడని ఆయన పేర్కొన్నాడు.

ఛాతీకి తగిలిన బంతి..

ఈ వీడియోలో విరాట్ కోహ్లీ కోచ్ రాజ్‌కుమార్ శర్మ కూడా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. క్రికెట్ అకాడమీకి విరాట్ కోహ్లి వచ్చినప్పుడు తన వయసులో ఉన్న పిల్లలతో ఎప్పుడూ ఆడేవాడు కాదు. తనకంటే వయసులో పెద్దవాళ్లతో ఆడతానని కోచ్‌తో చెప్పాడు. కోచ్ కూడా ఒకరోజు కోపం తెచ్చుకుని, అవకాశం కూడా ఇచ్చాడు. విరాట్ ఈ మ్యాచ్‌లో బాగా బ్యాటింగ్ చేసి, ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని ఛాతీకి బంతి తాకినప్పటికీ. ఈ విషయాన్ని కోహ్లీ ఎవరికీ చెప్పలేదు. అయితే అతని తల్లి ఇంట్లో చూసింది. దీంతో అసలు విషం తెలిపింది. విరాట్ కోహ్లీతో పాటు వయసులో ఉన్న పిల్లలకు కూడా అవకాశం ఇవ్వాలని కోచ్ రాజ్ కుమార్ శర్మకు చెప్పిందంట.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed