Rishabh Pant: డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. కాలు గాయంతో బాధపడుతున్న పంత్ ఇప్పుడు అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందించాడు.

World Cup 2023: ఎప్పుడెప్పుడా అని పంత్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రిషబ్ పంత్ ఎప్పుడు కోలుకుంటాడో అనే ప్రశ్న ప్రతి అభిమాని మదిలో మెదిలింది. ఇప్పుడు అభిమానులకు సమాధానం దొరికింది. రిషబ్ పంత్ కోలుకున్నాడు. అవును.. కాలు గాయంతో ఇబ్బందిపడుతున్న రిషబ్ పంత్.. ప్రస్తుతం సపోర్ట్ లేకుండా నడవడం ప్రారంభించాడు. ఈమేరకు రిషబ్ పంత్ క్రాచెస్ విసిరి పపోర్ట్ లేకుండా అడుగులు వేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

రిషబ్ పంత్ తన వీడియోలో KGF సినిమా సంగీతాన్ని ఉపయోగించాడు. ఇందులో ముందుగా ఊతకర్రను చేతిలో పట్టుకుని అడుగులు వేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా దాన్ని విసిరివేసి సపోర్టు లేకుండా నడవడం మొదలుపెట్టాడు. రిషబ్ పంత్ ఈ వీడియోను లక్షల మంది ప్రజలు లైక్ చేస్తున్నారు. అయితే ఈ శుభవార్తపై టీమిండియా ఆటగాళ్లు కూడా స్పందించారు. పంత్ రిటర్న్‌కు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా సెల్యూట్ చేశారు.

ఇవి కూడా చదవండి



రిషబ్ పంత్‌కి కొత్త జీవితం..

డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న పంత్‌ కారు హైవేపై బోల్తా పడింది. కారు బోల్తా పడిన తర్వాత దానికి మంటలు అంటుకున్నాయి. పంత్ ఎలాగోలా కారు దిగి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఆ తర్వాత, హైవేపై ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పంత్‌ను డెహ్రాడూన్‌లోని ఆసుపత్రి నుంచి ముంబైకి విమానంలో తరలించారు.

రిషబ్ పంత్ NCAలో పునరావాసం..

ప్రస్తుతం పంత్ కోలుకుంటున్నాడు. అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అక్కడ బీసీసీఐలోని అత్యుత్తమ ఫిజియోలు, శిక్షకులు అతన్ని వీలైనంత త్వరగా ఫిట్‌గా మార్చడంలో బిజీగా ఉన్నారు. రిషబ్ పంత్ ఫిట్ నెస్ సాధిస్తున్న స్పీడ్ చూస్తుంటే ఈ ఆటగాడు వరల్డ్ కప్ వరకు ఫిట్ గా ఉంటాడా అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రపంచకప్ జరగనుంది. ప్రపంచకప్‌ భారత్‌లో జరగనుంది. రిషబ్ పంత్ కోలుకుంటున్న వేగం చూస్తుంటే అందరికీ ఓ ఆశ కలుగుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *