సంక్రాంతి బ్లాక్‌ బస్టర్ల తర్వాత హిట్‌ సినిమా కోసం ఎదురుచూసిన టాలీవుడ్‌కి కొత్త ఊపిరి పోసింది విరూపాక్ష. సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ఈ సూపర్‌ న్యాచురల్ మూవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటించింది.

సంక్రాంతి బ్లాక్‌ బస్టర్ల తర్వాత హిట్‌ సినిమా కోసం ఎదురుచూసిన టాలీవుడ్‌కి కొత్త ఊపిరి పోసింది విరూపాక్ష. సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ఈ సూపర్‌ న్యాచురల్  థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 21న విడుదలైన విరూపాక్ష సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికే 80 కోట్లకు కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీ వందకోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఆకట్టుకునే కథనం, మరీ ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ అందించిన గ్రిప్పంగ్‌ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పటికీ థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో విరూపాక్ష డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

విరూపాక్ష సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీగానే చెల్లించిందని సమాచారం. ఈక్రమంలో ఈనెల 20వ తేదీ నుంచి విరూపాక్ష మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా తెలుగులో సూపర్‌ హిట్‌ కావడంతో ఇతర భాషల్లోనూ విరూపాక్ష రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు మూవీ మేకర్స్‌. ఇవాళ హిందీ, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుండగా, మే 12 నుంచి కన్నడలో విరూపాక్ష విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed