బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఫిల్మ్ ఆదిపురుష్‌. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి ప్రభాస్ అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు. మే 9న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నామంటూ అసలు విషయం రివీల్ చేశాడు డార్లింగ్. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చేశారు.

ఎప్పటి నుంచో ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్‌ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఫిల్మ్ ఆదిపురుష్‌. ఇప్పటికే ఎన్నో ట్రోల్సింగ్.. మరెన్నో విమర్శలతో సతమతమవుతున్న తాజాగా ఓ దిమ్మతిరిగే న్యూస్‌తో మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ డేట్ బయటికి రావడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఉబ్బితబ్బిబయ్యేలా.. ఎగిరిగంతేసేలా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఫిల్మ్ ఆదిపురుష్‌. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి ప్రభాస్ అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు. మే 9న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నామంటూ అసలు విషయం రివీల్ చేశాడు డార్లింగ్. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చేశారు.

ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ కనిపించనుండగా.. సీత పాత్రలో కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇటీవల సీతా నవమి సందర్భంగా కృతి సనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ సీతా రామ్ అంటూ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో.. జానకిగా కృతీ సనన్ నారచీరలతో ఉన్న పోస్టర్ మంత్రముగ్దులను చేసింది. జానకి పాత్రలో కృతి సనన్ స్వచ్ఛత, దైవత్వం, ధైర్యం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అయితే ఈ మూవీ లో సీత పాత్ర కి ముందుగా కృతిసనన్ ని అనుకోలేదట మేకర్స్.

ముందుగా సీత పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను తీసుకుందామనుకున్నరాట. ఇదే విషయాన్ని దీపికాతో చర్చిచగా.. అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ మూవీని వదులుకోవాల్సి వచ్చిందట. దీపికా తర్వాత అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు పరిశీలించిన తర్వాత చివరకు కృతిని ఓకే చేశారట. మొత్తానికి రామయాణ ఇతిహాసంలో ప్రభాస్ జోడిగా ఛాన్స్ కొట్టేసింది కృతి సనన్.

ఇవి కూడా చదవండిఇక ఆదిపురుష్ ఛాన్స్ మిస్సయిన దీపికా.. ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సైన్స్ యాక్షన్ మూవీగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed