శివలీల గోపి తుల్వా |

Updated on: May 06, 2023 | 8:10 PM

ఆచార్య చాణక్యుడు స్వయంగా అనేక విషయాలలో అనుభవశాలి, మేధావి. అందుకే వివిధ అంశాల గురించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. ఇంకా జీవిత మార్గాన్ని సుఖమయం చేసుకోవడానికి, ఈ మార్గమధ్యంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో కూడా బోధించాడు. అందుకే అతని మాటలను పాటించేవారు ఈ నాటికి విజయమార్గంలో నడుస్తున్నారు. అయితే విజయమార్గంలో నడవాలనుకునే వ్యక్తికి జీవితంలో కొన్ని రకాల అనుభవాలు పరిచయం అయి ఉండాలని, అప్పుడే అతను లక్ష్యాన్ని సాధించగలడని చెప్పాడు. మరి మనిషికి ఏయే అనుభవాలు తప్పనిసరిగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

May 06, 2023 | 8:10 PM

ఆచార్య చాణక్యుడు ప్రకారం ఎవరి జీవితంలోనూ నిత్యం దుఃఖం ఉండదు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఘటనల నుంచి గుణపాఠాలను నేర్చుకుంటే జీవితంలో విజయాన్ని సాధించవచ్చు. అంటే చేసిన తప్పులకు కారణాలు తెలుసుకుని వాటిని సరిచేసుకోవడమే విజయానికి మెట్టు అని చాణక్యుడు చెప్పాడు. కాబట్టి, చాణక్యుడి ప్రకారం తప్పులు చేయడం నేరం కాదు, కానీ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడం నేరం.

ఆచార్య డు ప్రకారం జీవితంలో అపజయాన్ని పొందడం చాలా అవసరం. వైఫల్యం లేకుండా ఒక వ్యక్తికి విజయానికి ఉన్న నిజమైన విలువ తెలియదు. చాణక్యుని ప్రకారం వైఫల్యం విజయానికి మొదటి మెట్టు. దీనితో మిమ్మల్ని మీరు బేరీజు వేసుకోవడం ద్వారా మీ తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఇలా చేయడం వల్ల త్వరలోనే విజయం సాధిస్తారు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం స్వతహాగా చాలా సూటిగా ఉండే వ్యక్తిని ప్రజలు తప్పుగా ఉపయోగించుకుంటారు. నిటారుగా నునుపైన చెట్టును నరికివేయడంలో ఎటువంటి సమస్య లేదు కదా, కాబట్టి మీలో కొంత తెలివిని దాచి ఉంచడానికి ప్రయత్నించాలని చాణక్యుడు చెప్పాడు. అప్పుడే మిమ్మల్ని నలుగురు మోసం చేయకుండా ఉంటారు. అది మీ విజయానికి సుగమంగా మారుతుంది.

చాలా మంది భయం కారణంగానే ఏ పని కూడా మొదలు పెట్టరు. అయితే కొత్త పనిని ప్రారంభించడంలో లేదా రిస్క్ తీసుకోవడంలో వెనుకడుగు వేయకూడదని చాణక్యుడు నమ్మాడు. రిస్క్ తీసుకోవడం ద్వారా రెండు విషయాలు మాత్రమే జరుగుతాయి, మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటారు లేదా మీరు ఆ పనిలో విజయం సాధిస్తారు.

చాణక్యుడి ప్రకారం జీవితంలో ఒకరి వయస్సును చూసి వారి సామర్థ్యాన్ని అంచనా వేయకూడదు. మీ కంటే చిన్న వ్యక్తి కూడా మీ కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండి, జీవితానికి సంబంధించిన కొన్ని గొప్ప పాఠాలను మీకు అందించగలడని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇతరులను బలహీనులుగా పరిగణించకూడదు, అలాగే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకూడదు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *