Diet for Diabetes: ప్రీడయాబెటిస్, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆహారం విషయంలో పలు రకాల నియమాలు, జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపే ఆహారాలను దూరం పెడుతూనే, వాటిని..

Diet for Diabetes: ప్రీడయాబెటిస్, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆహారం విషయంలో పలు రకాల నియమాలు, జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపే ఆహారాలను దూరం పెడుతూనే, వాటిని నియంత్రించే ఆహారాలను డైట్‌లోకి జోడించాలి. లేకపోతే చక్కెర స్థాయి పెరిగి ప్రాణానికే ముప్పుగా మారవచ్చు. ఈ క్రమంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరించే కొన్ని రకాల ఆహారలపు వైద్య, పోషకాహార నిపుణులు సూచించారు. వాటిని తినడం వల్ల మధుమేహులు చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను కూడా పొందగలుగుతారు. ఇంకా అనేక రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి వైద్యులు సూచిస్తున్న ఆ సూపర్ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే 7 సూపర్‌ఫుడ్స్:

గుమ్మడికాయ, గుమ్మడికాయ గింజలు: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా  కలిగిన గుమ్మడికాయ, దాని గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిచడానికి ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే మెక్సికో, ఇరాన్ వంటి దేశాలలో గుమ్మడికాయను మధుమేహులు ఒక ఔషధంగా తీసుకుంటారని వివరిస్తున్నారు. ఇంకా ముందుగా చెప్పుకున్నట్లుగా ఇందులోని ఫైబర్ కారణంగా మలబద్ధకం, అజీర్తి సమస్యలు దూరమవుతాయంట.

బెర్రీలు: బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో బెర్రీలు కూడా అద్భుతంగా ఉపయోగపడతాయని పలు అధ్యయానాలు వెల్లడించాయి. బెర్రీలలో పుష్కలంగా ఉండే ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు సహకరిస్తాయని ఆయా స్టడీస్ పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి



సిట్రస్ ఫ్రూట్స్: నిమ్మ, నారింజ వంటి పలు రకాల సిట్రస్ పండ్లు తీపిగా ఉన్నప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని పలు  శాస్త్రీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. తక్కువ గ్లైకమిక్ పండ్లుగా చెప్పుకునే సిట్రస్ పండ్లు పుచ్చకాయ, పైనాపిల్ ‌లాగానే బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయగలగడమే ఇందుకు కారణమని అవి చెబుతున్నాయి.

గుడ్లు: ప్రోటీన్, ప్రయోజనకర కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లకు నిలయమైన గుడ్లు అత్యంత పోషకమైన ఆహార పదార్థం. రక్తంలో చక్కెర స్థాయిలన నియంత్రించడంలో గుడ్లు ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

అవకాడోలు: అవకాడోలో ఉండే ఇన్సులిన్ రెసిస్టెంట్స్, డయాబెటిక్ పేషంట్స్‌లో రక్తంలో చక్కర స్థాయిలను మెరుగుపరిచే మోనోసాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దం చేయడానికి మరియు ఇన్సులిన్ స్థాయిలని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, అవకాడోలలో ఉండే ఫైబర్ నిక్షేపాలు రక్తంలో చక్కర నిల్వలు పెరగకుండా చూడడంలో సహాయం చేస్తాయి.

యాపిల్స్: కరిగే ఫైబర్, క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, గల్లిక్ యాసిడ్ వంటివి యాపిల్స్‌లో సమృద్ధిగా ఉన్నందున ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలవు.

చియా విత్తనాలు: చియా విత్తనాలను తీసుకోవడం ద్వారా కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఇందులోని ఫైబర్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అధిక కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ న్యూస్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed