
అన్ని జబ్బులకు మూలం కొలెస్ట్రాల్.. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో ఎన్నో సమస్యలు పెరుగుతాయి. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి, మీరు మీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవాలి. లేకుంటే క్రమంగా సమస్యలు పెరిగే అవకాశముంది. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుందని అందరికీ తెలిసిందే. మొదటిది మంచి.. రెండవ చెడు కొలెస్ట్రాల్.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు నుంచి హై బిపి.. ఇంకా అలసట.. తదితర సమస్యలు కనిపిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే.. ఎలాంటి పదార్థాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ ఉన్నవారు వీటిని తినకూడదు..
మీట్ కు దూరంగా ఉండాలి: మాంసాహారం ఎక్కువగా తినే వారు దానికి దూరంగా ఉండాలి. లేకుంటే సమస్యలు పెరుగుతాయి. మాంసాహారం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.
చికెన్ కి పుల్‌స్టాప్ పెట్టండి: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చికెన్ తినకూడదు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికే కొలెస్ట్రాల్ ఉండి.. చికెన్ తింటున్న వారికి క్రమంగా సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాల ఉత్పత్తులు : పాల ఉత్పత్తులు కూడా మీ ఆరోగ్యానికి మంచివి కావు. కొంతమంది పాల ఉత్పత్తులపై ఆధారపడటం చూసే ఉంటారు. అలాంటివారు లావుగా కనిపిస్తారు. అయితే, స్థూలకాయంతో బాధపడేవారు ఫ్యాట్ పాలపదార్ధాలను మానుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..