కర్నాటక ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర రాజధాని బెంగళూరులో భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అభివృద్ధికి సంబంధించి కీలక ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

కర్నాటక ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర రాజధాని బెంగళూరులో భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అభివృద్ధికి సంబంధించి కీలక ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ఇప్పటి వరకు తాము చేసిన పనులను వివరిస్తూ.. తదుపరి ప్రభుత్వం ఏర్పాటైతే ఏం చేస్తామనేది వివరిస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ సారాంశం..

‘మరికొద్ది సేపట్లో నగర ప్రజలతో ఇంటరాక్ట్ అవడానికి బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో రోడ్‌షోను ప్రారంభిస్తాను. బెంగళూరు, బీజేపీ మధ్య బలమైన బంధం ఉంది. ఈ నగరం ప్రారంభ రోజుల నుండి బీజేపీకి మద్దతునిస్తోంది. అలాగే నగర అభివృద్ధికి అనేక ప్రయత్నం చేశాం.’

ఇవి కూడా చదవండిమా పార్టీ సిద్ధాంతం అభివృద్ధి.. అభివృద్ధి.. అభివృద్ధి. అభివృద్ధి చుట్టే మా సిద్ధాంతం తిరుగుతుంది. మేము సామాజిక న్యాయ అంశాల్లో చాలా సున్నితంగా ఉంటాము. భవిష్యత్తుపై విజన్ కలిగి ఉన్నాము. గత 4 సంవత్సరాలలో అనేక మంది జీవితాలను మార్చిన కొన్ని విజయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. కర్నాటకలో మా ట్రాక్‌ రికార్డ్‌తో పాటు.. ఇప్పటి వరకు సాధించిన విజయాలతో పాటు మరిన్ని విజయాలు నమోదు చేస్తాం. కర్నాటకను నెంబర్ 1 రాష్ట్రంగా మార్చడంతో పాటు.. బెంగళూరును అభివృద్ధి పథంలో అసమానమైన స్థితిలో ఉంచేందుకు ప్రయత్నిస్తాం. అభివృద్ధి ఫలాలు అందించడానికి మరొక్కసారి బెంగళూరు ప్రజలు ఆశీర్వాదాలను కోరుతున్నాం.

హెల్త్‌కేర్, హౌసింగ్, పారిశుధ్యం అన్ని అంశాల్లోనూ బెంగళూరు అభివృద్ధి చెంది. ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కారణమైంది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ ప్రధాన లక్ష్యం.. సరైన రవాణా, మౌలిక సదుపాయాలు. మా ప్రభుత్వం మెరుగైన కనెక్టివిటీ, గొప్ప శ్రేయస్సు కోసం భవిష్యత్ ప్రాజెక్టులను అందించింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా, మెరుగైన రహదారులు, మరింత సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థలు, అత్యుత్తమ నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం అధిక ప్రాధాన్యతను ఇస్తాం. ఈ విషయంలో మా ప్రస్తుత ప్రయత్నాలలో కొన్ని ఇక్కడ ఉన్నాయి. సాంకేతికత లేదా రవాణా ఏదైనా కావచ్చు.. మేము ప్రజల అంచనాలకు అనుగుణంగా, సాంకేతిక ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా బెంగళూరు స్థానాన్ని నిలిపే విధంగా పని చేస్తున్నాం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *