కానీ వీరు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇప్పటివరకు సామ్ మాత్రమే కొన్ని సందర్భాల్లో పరొక్షంగా డివోర్స్ గురించి స్పందించినప్పటికీ చైతూ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక ఇటీవల కస్డడీ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడాకులపై చైతూ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంట అక్కినేని నాగచైతన్య.. సమంత. నాలుగేళ్లు ప్రేమాయణం తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో 2017 అక్టోబర్ 7న వివాహం బంధంతో ఒకటయ్యారు. ఈ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే ఉండేది. అయితే ఆకస్మాత్తుగా తామిద్దరం విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది ఈ జంట. 2021లో తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వీరిద్దరు విడిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. కానీ వీరు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇప్పటివరకు సామ్ మాత్రమే కొన్ని సందర్భాల్లో పరొక్షంగా డివోర్స్ గురించి స్పందించినప్పటికీ చైతూ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక ఇటీవల కస్డడీ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడాకులపై చైతూ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

సమంతతో గడిపిన రోజుల్ని చాలా గౌరవిస్తానని.. ఆమె చాలా లవ్లీ పర్సన్ అని తన మాజీ భార్యపై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఆమె ఎప్పటికీ సంతోషంగా ఉండాలని.. అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు అంటూ కామెంట్స్ చేశాడు. చైతూ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా సమంత చేసిన ఇన్ స్టా పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

తన ఇన్ స్టాలో “మనమంతా ఒక్కటే.. కేవలం అహంకారం, భయాలు మనల్ని దూరం చేస్తాయి ” అంటూ ఓ కొటేషన్ ను షేర్ చేసింది. చై కామెంట్స్ అనంతరం సామ్ ఇలా పోస్ట్ చేయడంతో ఇప్పుడు వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే వీరిద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం, గౌరవం ఉన్నాయని.. కానీ మధ్యవర్తుల కారణంగా వచ్చిన మనస్పర్థలు, ఈగోల వల్లే వీరి విడిపోయారంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండిSam

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed