ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. మరోవైపు రాజకీయంలోనూ రాణిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టండి. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా అరంగేట్రం చేసి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో సత్తా చాటింది. దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా కలువల్లాంటి కన్నులు.. అందమైన మోము.. సహజనటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులోనే కాదు.. హిందీ, తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. మరోవైపు రాజకీయంలోనూ రాణిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టండి. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా అరంగేట్రం చేసి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

ఆమె అలనాటి అందాల తార జయప్రద. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె పేరును జయప్రదగా మార్చారు. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాలు నిడివిగల పాట కోసం ఆమెను తీసుకున్నారు. అలా మొదలైన సినీ ప్రస్థానం 2005వరకు దాదాపు మూడు దశాబ్దాల వరకు సాగింది. తెలుగుతోపాటు.. కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది.

1986 జూన్ 22న సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు జయప్రద. సీనియర్ ఎన్టీఆర్ ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరి రాజకీయరంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed