ప్రస్తుతం తెలుగులో ట్యాలెంటెడ్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అతనికి ఫ్యాన్‌ బేస్‌ బాగానే ఉంది. అందుకు కారణం అతను ఎంచుకున్న వైవిధ్యమైన కథలే. రోటీన్‌ స్టోరీలను కాకుండా భిన్న నేపథ్యంతో సినిమాలు చేస్తుంటాడాయన. జయపజయాలతో సంబంధం లేకుండా..

సినిమాల కోసం ఎంత రిస్క్‌కైనా వెనకాడని హీరోలు మన టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. ముఖ్యంగా సినిమా, సినిమాకు తమ దేహాకృతిని మార్చుకుంటుంటారు కొందరు. సిక్స్‌ ప్యాక్‌, ఎయిట్‌ ప్యాక్‌ అంటూ తమ దేహాన్ని బాగా కష్టపెడుతుంటారు. అలాగే యాక్షన్‌ సీన్లు సహజసిద్ధంగా రావడానికి ఎంతటి రిస్కీ స్టంట్లనైనా చేస్తుంటారు మరికొందరు. సినిమాలు సక్సెస్‌ కాలేకపోయినా వీరి యాక్షన్‌ సీక్వెన్స్‌లకు మంచి గుర్తింపు వస్తుంటుంది. పై ఫొటోలో ఉన్న కుర్రాడు ఈ కోవకు చెందిన వాడే. ప్రస్తుతం తెలుగులో ట్యాలెంటెడ్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అతనికి ఫ్యాన్‌ బేస్‌ బాగానే ఉంది. అందుకు కారణం అతను ఎంచుకున్న వైవిధ్యమైన కథలే. రోటీన్‌ స్టోరీలను కాకుండా భిన్న నేపథ్యంతో సినిమాలు చేస్తుంటాడాయన. జయపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. మరి పై ఫొటోలో ఉన్న ఆ హీరోను ఎవరో గుర్తుపట్టారా? కనిపెట్టకపోయినా నో ప్రాబ్లమ్‌.. సమాధానం మేమే చెబుతాం. అతను మరెవరో కాదు.. టాలీవుడ్‌ ట్యాలెంటెడ్‌ హీరో సందీప్‌ కిషన్‌.

2010లో ప్రస్థానం హీరోతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు సందీప్‌. ఆతర్వాత స్నేహగీతం, ఇట్స్‌ మై లవ్‌ స్టోరీ, రొటీన్‌ లవ్‌స్టోరీ, గుండెల్లో గోదారి వంటి సినిమాలు చేశాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో మంచి బ్రేక్‌ అందుకున్నాడు. ఆ తర్వాత రారా కృష్ణయ్య, బీరువా, శమంతకమణి, తెనాలి రామకృష్ణ, నిను వీడని నీడను నేనే తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఏ1 ఎక్స్‌ప్రెస్‌, గల్లీ రౌడీ, మైఖేల్‌ మూవీస్‌ కోసం సిక్స్‌ ప్యాక్‌ను ట్రై చేశాడీ ట్యాలెంటెడ్‌ హీరో. నిర్మాతగానూ సత్తా చాటాడు. ఊరు పేరు భైరవకోన అంటూ త్వరలో మళ్లీ మన ముందుకు రానున్నాడు సందీప్‌. ఆదివారం (మే7) ఈ టాలీవుడ్‌ హీరో పుట్టిన రోజు. మరి అతను మరెన్నో విజయాలు అందుకోవాలని మనమూ ఆకాంక్షిద్దాం.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *