యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సందీప్‌కు జోడిగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలతో ఢీలా పడిన సందీప్‌ కిషోర్ ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందులో భాగంగా..

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సందీప్‌కు జోడిగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలతో ఢీలా పడిన సందీప్‌ కిషోర్ ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందులో భాగంగా ఓ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఇప్పటికే వచ్చిన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్‌ లుక్‌ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్‌.. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

నిమిషం నిడివి ఉన్న ఈ సినిమా టీజర్‌ ఆద్యంతం ఆసక్తికంగా ఉంది. భైరవ కోన అనే విలేజ్‌ చుట్టూ ఈ సినిమా కథ నడవనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక టీజర్‌లో వచ్చే.. ‘శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణానికి ఇప్పటి గరుడపురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి’ డైలాగ్‌ ఆసక్తిని పెంచేసింది. ఇంతకీ మాయమైన పేజీలు ఏమయ్యాయి.? అసలు హీరోకి, భైరవకోనకు ఉన్న సంబంధం ఏంటి.? గరుడ పురాణంలో మాయమైన పేజీల గురించి హీరో ఏం తెలుసుకున్నాడన్న విషయాలను సినిమాలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.ఇవి కూడా చదవండిఇక టీజర్‌కు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలను టీజర్‌ భారీగా పెంచేసింది. మరి ఈ సినిమాతోనైనా సందీప్‌ కిషన్‌ మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కుతాడా చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *