టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించడంపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు మంత్రులు, వైసీపీ నేతలు. గతంలో వ్యవసాయం దండగా అని ప్రకటన చేసిన వ్యక్తి.. ఇప్పుడు రైతుల కష్టాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

అదే వేడి..! అకాలవర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకునే విషయంలో టీడీపీ విమర్శలు ఆగడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు విధించిన 72 గంటల డెడ్‌లైన్‌ చూట్టూనే మంటలు రాజుకుంటున్నాయి. తణుకు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రోడ్లపై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. కనీస మద్దతుధర చెల్లించి ప్రభుత్వమే ధాన్యం సేకరిస్తుందని అన్నదాతలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు అల్టిమేటాలను ప్రస్తావిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు గతాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు కారుమూరి నాగేశ్వరరావు .

రైతులపై మాట్లాడే హక్కు చంద్రబాబు లేదన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. వర్షాలు పడతాయని తెలిసినప్పుడే ముందు జాగ్రత్తలు చేపట్టిందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. రైతుల కష్టాలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

రైతులను చంద్రబాబు ఏనాడైనా ఆదుకున్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏనాడైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తనను తిట్టడానికే పర్యటన పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. రైతు సమస్యలపై బాబుకు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. రైతులకు సాయం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ ఒకే పాట పదే పదే పాడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి ఈమేరకు మాట్లాడారు.

మొత్తానికి డెడ్‌లైన్‌ పూర్తికాగానే పోరుబాటుకు టీడీపీ సన్నాహాలు చేసుకుంటుంటే.. ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికారపక్షం కూడా సిద్ధమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed