CSK vs MI: శనివారం జరిగిన ‘ఐపీఎల్ ఎల్ క్లాసికో’ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతే చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున 2 వికెట్లు తీసిన సీనియర్ స్పిన్ బౌలర్‌ పియూష్‌ చావ్లా అరుదైన రికార్డు..

CSK vs MI: శనివారం జరిగిన ‘ఐపీఎల్ ఎల్ క్లాసికో’ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతే చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున 2 వికెట్లు తీసిన సీనియర్ స్పిన్ బౌలర్‌ పియూష్‌ చావ్లా అరుదైన రికార్డు అందుకున్నాడు. 34 ఏళ్ల లేటు వయసులో ఉన్న తనలోని బౌలింగ్ సామర్థ్యానికి లోటు లేదని నిరూపించేలా.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అవతరించాడు. చెన్నై ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే వికెట్లను పడగొట్టడం ద్వారా చావ్లా ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో మరో సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను కూడా అధిగమించాడు చావ్లా. ప్రస్తుతం చావ్లా ఖాతాలో 174 ఐపీఎల్ వికెట్లు ఉండగా.. మ్యాచ్‌కి ముందు 172 వికెట్లతో అమిత్ మిశ్రాతో పాటు మూడో స్థానంలో ఉన్నాడు.

అయితే ఐపీఎల్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు, ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 183 ఐపీఎల్ వికెట్లతో బ్రావో అగ్రస్థానంలో ఉండగా.. 179 వికెట్లతో రాజస్థాన్‌ రాయల్స్ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా 174 వికెట్లతో చావ్లా మూడో స్థానంలో నిలవగా.. అమిత్‌ మిశ్రా (172), లసిత్ మలింగ (170), రవిచంద్రన్ అశ్విన్‌ (170) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరో విశేషమేమిటంటే.. ఐపీఎల్ కెరీర్ ముగిసింది అనుకున్న సమయంలో మళ్లీ అవకాశం పొందిన చావ్లా ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 ఆటల్లోనే 17 వికెట్లు పడగొట్టడంతో పాటు పర్పుల్ క్యాప్ రేసులో నాల్గో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి



కాగా, ముందుగా చెప్పుకున్నట్లుగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అలా 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సునాయాసంగా విజయం అందుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *