మధుమేహం లేదా డయాబెటీస్‌తో బాధపడేవారు తమ ఆహరం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే శరీరంలో షుగర్ లెవెల్స్‌ పెరిగిపోయి ప్రాణాపాయ స్థితికి వెళ్తారు. ఈ కారణంగానే చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు పంచదారకు ప్రత్యామ్నాయం..

Artificial Sweeteners Side Effects

మధుమేహం లేదా డయాబెటీస్‌తో బాధపడేవారు తమ ఆహరం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే శరీరంలో షుగర్ లెవెల్స్‌ పెరిగిపోయి ప్రాణాపాయ స్థితికి వెళ్తారు. ఈ కారణంగానే చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు పంచదారకు ప్రత్యామ్నాయంగా తక్కువ కేలరీలు ఉండే ఆర్టిఫిషియల్ స్వీటెనర్లను ఉపయోగిస్తుంటారు. సకారిన్, సుక్రాలోజ్, నియోటేమ్, ఆస్పర్టేమ్ వంటి అర్టిఫిషియల్ స్వీటెనర్లు మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. అయితే వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని, వీటి కారణంగా గుండె సంబంధిత సమస్యలు, కాలేయానికి హాని కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక వీటిని తినేవారికి మూడ్ స్వింగ్స్ సమస్యలు వెంటాడతాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలో అర్టిఫిషియల్ స్వీటనర్ల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలేమిటో ఇప్పుడు చూద్దాం..

గుండె సమస్యలు: అర్టిఫిషియల్ స్వీటెనర్లు టైప్ 2 డయాబెటిస్, గుండె వ్యాధులకు కారకాలుగా పనిచేస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంకా ఈ రకమైన స్వీటెనర్లు ఇన్సులిన్ నిరోధకతను పెంచి కడుపులో మంట కలిగేలా చేస్తాయి.

కాలేయ సమస్యలు: ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి కారకాలు.అర్టిఫిషియల్ స్వీటెనర్లలో ట్రై గ్లిసారాయిడ్లు అనే కొవ్వులు ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకొనిపోయి దాని పనితీరు, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

ఇవి కూడా చదవండి



బరువు సమస్య: తక్కువ కేలరీలన కలిగి ఉండడమే కాక రుచిలో చక్కెరలా ఉంటాయని ఈ మధ్య కాలంలో అర్టిఫిషియల్ స్వీటనర్ల ప్రాముఖ్యత విపరీతంగా పెరిగింది. అయితే వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా వీటిని తినడం వల్ల మానవ శరీరానికి కేలరీలను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోతుందంట. ఫలితంగా విపరీత స్థాయిలో బరువు పెరుగుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూడ్ స్వింగ్స్: తక్కువ కేలరీలను కలిగి ఉంటాయని తీసుకునే అర్టిఫిషియల్ స్వీటనర్లు మన మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్ లెవెల్స్‌ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా మానసిక స్థితి, ప్రవర్తనలో మార్పులు ఎదురవుతాయి. ఇంకా మెదడులోని సిరటాయిన్ లెవెల్స్ నియంత్రణలోకి వచ్చి మానసిక ఆందోళనకు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీస్తాయి.

తలనొప్పి: అర్టిఫిషియల్ స్వీటెనర్లు మెదడు పనితీరు, నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. న్యూరో ట్రాన్స్‌మిటర్ స్థాయిల్లో మార్పు, రక్త సరఫరాలో మార్పుకు కూడా కారణమవుతాయి. ఫలితంగా మీలో తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు కనిపిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *