ఒకవైపు ఢిల్లీ బ్యాటర్లు పుంజుకుంటుంటే.. మరోవైపు ఆ జట్టు కంటే అధ్వాన్నంగా సన్‌రైజర్స్ పరిస్థితి తయారైంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు కేవలం 6 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఐపీఎల్ 2023 రసవత్తరంగా మారింది. రెండో భాగంలోకి వచ్చేసరికి ప్లే-ఆఫ్స్ రేసులో ఉండేందుకు అన్ని జట్లు హోరాహోరీగా తలబడుతున్నాయి. క్వాలిఫై అయ్యేందుకు ఒక్కో జట్టుకు 16 పాయింట్లు అవసరమై ఉండగా.. గుజరాత్ టైటాన్స్ జట్టు 14 పాయింట్లతో అగ్రస్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ 13 పాయింట్లతో రెండో స్థానంలో, లక్నో 11 పాయింట్లతో మూడు, ఆ తర్వాత 4 జట్లు 10 పాయింట్లలో, 2 జట్లు ఎనిమిదేసి పాయింట్లతో, 6 పాయింట్లతో ఇంకొక జట్టు పట్టికలో నిలిచాయి. ఇప్పటిదాకా చెత్త ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ జట్టు బ్యాటర్లు విఫలం కావడం వల్లే ఈ దుస్థితికి కారణం అని భావించారు. అయితే ఇప్పుడు ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు విజ‌ృంభిస్తున్నారు. వెరిసి ఢిల్లీ ఫస్ట్ 5 మ్యాచ్‌లలో 5 ఓడిపోగా.. ఆ తర్వాత సెకండ్ 5 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించింది. ఇక ఈ సమయంలో ఢిల్లీ ప్లేస్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ భర్తీ చేస్తోంది.

ఒకవైపు ఢిల్లీ బ్యాటర్లు పుంజుకుంటుంటే.. మరోవైపు ఆ జట్టు కంటే అధ్వాన్నంగా సన్‌రైజర్స్ పరిస్థితి తయారైంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు కేవలం 6 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది. కోట్లు పోసి కొనుగోలు చేసిన ఆ జట్టు బ్యాటర్లు ఏ ఒక్కరూ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపొతున్నారు. ఇంకా చెప్పాలంటే.. అత్యధిక రన్ గెట్టర్స్‌లో టాప్ 30లో కూడా మన హైదరాబాద్ బ్యాటర్లు లేరు. ఈ సీజన్‌లో హ్యారీ బ్రూక్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో 163 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో 45వ స్థానంలో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి కేవలం ఒక్క బ్యాటర్ మాత్రమే ఈ లిస్టులో ఉన్నాడు. కాగా, ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో హైదరాబాద్ గెలవకపోతే.. ప్లే-ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *