ఇక మరోసారి వెన్నెల పాత్రతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం కీర్తి భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో చిరంజీవి చెల్లిగా కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తాలో జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో కీర్తి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇటీవల దసరా బ్లాక్ బస్టర్ హిట్‏తో ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ కీర్తి సురేష్. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఊరమాస్ లుక్ లో నాని, కీర్తి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మరోసారి వెన్నెల పాత్రతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం కీర్తి భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో చిరంజీవి చెల్లిగా కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తాలో జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో కీర్తి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

అందులో మొహామంతా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అంతేకాకుండా.. కీర్తి ఎడమ కంటికి గాయమైనట్లుగా కనిపిస్తుంది. అయితే ఇదంతా నిజంకాదు.. కేవలం గతంలో తాను నటించిన ఓ సినిమా చిత్రీకరణకు సంబంధించిన వీడియో. గతేడాది కీర్తి సురేష్, డైరెక్టర్ సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన చిత్రం సాని కాయిదం. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2022 మే 6న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తైన సందర్భంగా కీర్తి సురేష్ షూటింగ్ కు సంబంధించిన వీడియో, ఫోటోస్ షేర్ చేసింది.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో పడిన కష్టాలను వివరిస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతుండగా.. కీర్తి డేడికేషన్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దసరా సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *