బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్స్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో కృతికి అవకాశాలు తగ్గాయి. నిన్న మొన్నటి వరకు క్రేజీ హీరోయిన్‌ అనే ట్యాగ్‌తో టాలీవుడ్‌లో తెగ వైరల్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయారు. వరస ప్లాప్స్ రావడంతో.. కాస్త సైలెంట్ అయిపోయారు.

ఉప్పెన సినిమాతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది కృతి శెట్టి. ఈ మూవీ విడుదలకు ముందే ఈ ముద్దుగుమ్మ భారీగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్స్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో కృతికి అవకాశాలు తగ్గాయి. నిన్న మొన్నటి వరకు క్రేజీ హీరోయిన్‌ అనే ట్యాగ్‌తో టాలీవుడ్‌లో తెగ వైరల్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయారు. వరస ప్లాప్స్ రావడంతో.. కాస్త సైలెంట్ అయిపోయారు.

ఈ క్రమంలో కృతి ఆశలన్నీ కస్టడీ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాతో సాలీడ్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లో పాజిటివ్ వైబ్స్‌తో.. కనిపిస్తున్నారు. కానీ తాజాగా ఇదే సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తెలిసీ తెలియక ఆన్సర్ ఇచ్చి ఇప్పుడు నెట్టింట ట్రోల్ అవుతున్నారు. వ సామ్రాట్ చైతో పాటు.. కస్టడీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్‌తో..ప్రశ్నోత్తరాల సెషన్‌లో పాల్గొంది కృతి. ఉప్పెన తరువాత ఫెయిల్యూర్‌లో ఉన్న తనకు చై బంగార్రాజుతో సక్సెస్ ఇచ్చారు కదా.. అని గుర్తు చేస్తూ ఓ ప్రశ్న అడిగారు. దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కానీ కృతి.. నేరుగా చై వంక తిరిగి నువ్వు నాకు సక్సెస్ ఇచ్చావా అన్నారు. దాంతో పాటే.. సక్సెస్ ఏ ఒక్కరు ఇవ్వలేరంటూ చెప్పారు. దీంతో అందరూ ఒక్క సారిగా షాకయ్యారు.

ఆ వెంటనే నాగ్, చైతూ వల్లనే కాదు.. సంక్రాంతి వల్ల కూడా బంగార్రాజు హిట్ అయిందంటూ.. నాన్ సింక్లో చెప్పినట్టు చెప్పారు కృతి. ఇంకేదో చెప్పబోతుండగా… ఆమె ఆన్సర్‌ ఇవ్వడం ఆపేయాలన్నట్టు.. మరో రిపోర్టర్ చైకు ప్రశ్నడిగారు. అలా ప్రశ్నోత్తరాల సెషన్‌ను ముగించారు. అయితే కృతి మాట్లాడిన మాటలు.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తెలిసీ తెలియక అలా నోరు జారి కృతి అలా మాట్లాడి ఉండొచ్చనే కామెంట్స్‌ నెట్టింట నుంచి వస్తున్నాయి.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed