ఇటీవల సామ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతోపాటు.. మిగతా భాషల్లోనూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో చూడ్డానికి ఎంతో అందంగా ఉందనే చెప్పుకోవాలి.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న లేటేస్టి చిత్రం ఖుషి. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తోంది. మొదటిసారి సామ్, విజయ్ కాంబోలో వస్తోన్న ప్రేమకథ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అయితే చాలా రోజుల నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్డే్ట్స్ కోసం సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సామ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతోపాటు.. మిగతా భాషల్లోనూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో చూడ్డానికి ఎంతో అందంగా ఉందనే చెప్పుకోవాలి.
అయితే ఇందులో సమంత, విజయ్ లుక్స్ బ్యూటిఫుల్ గా కకనిపిస్తుండగా.. వారి ఇద్దరి మధ్య మంచి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో సామ్ ముస్లీం యువతిగా నటించనున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇక ఇటీవల విడుదలైన సామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెడలో నల్లపూసలు.. నుదుటిన బొట్టుతో కనిపించింది సామ్. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది.
ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.