జర్మనీలో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ -2023 కి హాజరుకావాల్సిందిగా కోరుతూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కి ఆహ్వానం అందింది. జర్మనీ-అసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఏటా ఈ సదస్సు నిర్వహిస్తారు.

మంత్రి కేటీఆర్‌కి మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీలోని బెర్లిన్‌లో జూన్ 12 నుంచి 15 వరకు జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ -2023 సదస్సుకి హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌ కి ఆహ్వానం అందింది. కనెక్టింగ్ స్టార్ట్ అప్ ఈకో సిస్టం అనే అంశంపై ఈ సమావేశంలో ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ని ఆహ్వానించారు నిర్వాహకులు. జర్మనీ సెనెట్ కి చెందిన ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖ… మంత్రి కేటీఆర్ కి ఈ ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా భారత్ తో పాటు తెలంగాణ మరియు ఇతర దేశాల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలను ఏర్పర్చుకోవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సదస్సు నిర్వాహకులు.

జర్మనీ-అసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఏటా ఈ సదస్సు నిర్వహిస్తారు. ముఖ్యంగా జర్మనీలో ఉన్న స్టార్ట్ అప్ లను అసియా ఖండంలోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్ టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలపై ఈ యేడాది జరిగే సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు.

పెట్టుబడిదారులకు ప్రత్యేకంగా నిర్వహించే ఈ సెషన్‌ని స్టార్ట్ అప్ కంపెనీలు సద్వినియోగం చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. జర్మనీలో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం బలాన్ని అసియా ఖండంలోని స్టార్ట్ అప్ లతో పంచుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు మంత్రి కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *